ఆ తప్పు మోదీది కాదు, అమిత్ షా దే : శివసేన
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంపాలైన భారతీయ జనతా పార్టీపై, శివసేన ఘాటైన విమర్శలు చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓటమికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాదని, అమిత్ షా వ్యూహరచన విఫలమైందని మండిపడింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంపాలైన భారతీయ జనతా పార్టీపై, శివసేన ఘాటైన విమర్శలు చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓటమికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాదని, అమిత్ షా వ్యూహరచన విఫలమైందని మండిపడింది.
లోక్‌సభ ఎన్నికలలో మోడీ చరిష్మాతో విజయాలందుకుంటున్న బీజేపీ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో "కఠినమైన పోటీని" ఎదుర్కొంటుందని, బీజేపీ వరుసగా మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానాల్లో బలహీనమైపోయిందని సామ్నా లో పేర్కొంది.
ఢిల్లీలో బీజేపీ ప్రచారాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించిన కేంద్ర హోం మంత్రి, వందల సంఖ్యల్లో ర్యాలీలు, కేంద్ర మంత్రులతో, బీజేపీ ముఖ్యమంత్రులతో చేయించినప్పటికీ విజయం సాధించలేకపోయారని సామ్నాలో పేర్కొంది. యాభైకి పైగా కేంద్ర మంత్రులు ఇంటింటికి తిరిగి ప్రచారం చేసినప్పటికీ ప్రజలు మొండి చేయి చూపారని సామ్నా తెలిపింది.
ఢిల్లీ అసెంబ్లీలో ఎన్నికల్లో 70 స్థానాల్లో 62 స్థానాలను గెలుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ, అద్భుతమైన ఫలితాలను సాధించిందని, బీజేపీ ఓటింగ్ శాతాన్ని గతంలో కంటే ఈ ఎన్నికల్లో మెరుగుపర్చినప్పటికీ, సీట్ల విషయంలో రెండంకెలకు చేరుకోలేకపోయిందని, కేవలం ఎనిమిడి స్థానాలతో సరిపెట్టుకుందని సామ్నాలో పేర్కొంది.