Independence Day 2023: 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు మరి కొద్దిగంటలే మిగిలుంది. దేశ రాజధానిలో జరిగే పంద్రాగస్టు వేడుకలకు ఎర్రకోట ముస్తాబైంది. విదేశీయులు కాదు స్వదేశీయులే ఈసారి అతిధులు. వీఐపీలు కాదు సామాన్యులే ఈసారి ముఖ్య అతిధులు. కనీవినీ ఎరుగుని రీతిలో భారీ భద్రత ఏర్పాటైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ రాజధాని నగరం ఢిల్లీ ఎర్రకోట స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ 10వ సారి ఎర్రకోట నుంచి జాతీయ జెండా ఎగురవేసి ప్రసంగించనుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. పదేళ్ల ఎన్డీయే ప్రభుత్వంలో సాధించిన విజయాలు ప్రస్తావిస్తూ కొత్త పథకాలు ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇండిపెండెన్స్ డే వేడుకలకు ఈసారి కట్టుదిట్టమైన నాలుగంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ప్రతి నిమిషం పర్యవేక్షించేలా ఎర్రకోట పరిసరాల్లో ఏకంగా 1000 సీసీ కెమేరాలు ఏర్పాటయ్యాయి. అంటే ఎర్రకట పరిసరాలు మొత్తం కెమేరా కనుసన్నల్లో ఉంటాయి. మరోవైపు 7 వేలమంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. 16 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కెమేరాలు సైతం ఏర్పాటయ్యా.యి.


మరోవైపు ఈసారి పంద్రాగస్తు వేడుకలకు ఇతర దేశాల వీఐపీలు ముఖ్య అతిదులుగా రావడం లేదు. దేశంలోని  సామాన్యులనే ముఖ్య అతిధులుగా పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 1800 మందికి ఆహ్వానాలు అందాయి. వీరిలో 400 మంది సర్పంచ్‌లు కాగా 250 మంది వ్యవసాయ ఉత్పాదక సంఘాల ప్రతినిధులు, 50 మంది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం కౌశల్ వికాస్ యోజన లబ్దిదారులున్నారు. వీరితోపాటు సెంట్రల్ విస్టా భవన నిర్మాణంలో పాల్గొన్న కార్మికులు, ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయలు, నర్శులు, మత్స్యకారులు ఉన్నారు. మరోవైపు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ప్రతి రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతం నుంచి 75 మంది దంపతులకు ఆహ్వానించారు. 


Also read: Independence Day 2023: ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే జాతీయ జెండా ఆవిష్కరణలో తేడా ఎంతమందికి తెలుసు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook