ఢిల్లీ: దేశ రాజధానిలో చెలరేగుతున్న అల్లర్లపై, మత హింసను ఓ వర్గం ప్రేరేపిస్తుందన్న ఆరోపణలపై భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నిప్పులు చెరిగారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశ రాజదానిలోని తాజా పరిస్థితిపై కేంద్రం, కేంద్ర హోంమంత్రి, ఢిల్లీ ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆమె అన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శాంతి, సామరస్యాన్ని కాపాడాలని, పరిస్థితిని అదుపులోకి వచ్చేలా చూడాలని ఆమె డిమాండ్ చేశారు. ఢిల్లీలోని ఆస్తి, ప్రాణ నష్టానికి 
 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని, రెండూ కూడా సమాన బాధ్యత వహించాలని అన్నారు. కాగా, రెండు ప్రభుత్వాల సమిష్టి వైఫల్యమే రాజధాని నగరంలో ఈ విషాదానికి దారితీసిందని ఆమె అన్నారు. 



 


ఢిల్లీ వీధుల్లో హింస నిరంతరాయంగా కొనసాగుతోందని, పోలీసు వ్యవస్థ ఏం చేస్తోందని ఆమె ప్రశ్నిచారు. గత 72 గంటల్లో, హెడ్ కానిస్టేబుల్‌తో సహా ఇప్పటివరకు సుమారు 18 మంది ప్రాణాలు కోల్పోయారని, వందలాది మంది గాయాల పాలై ఆసుపత్రిలో ఉన్నారని, ఆమె పేర్కొన్నారు. 


ఢిల్లీలో జరుగుతున్న హింస వెనుక స్పష్టమైన కుట్ర దాగి ఉందని, మూడు రోజుల క్రితం బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా చేసిన విద్వేష ప్రసంగమే దీనికి కారణమని ఆమె పేర్కొన్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భద్రతా దళాలను మోహరింపజేయాలని ఆమె డిమాండ్ చేశారు. 
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..