Delhi Schools: కరోనా ఫోర్త్‌వేవ్ సంకేతాలు వెలువడినట్టేనా..దేశ రాజధాని ఢిల్లీ స్కూల్స్‌లో భారీగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చిన్నారుల్లో. ఆ స్కూల్స్ మళ్లీ మూసివేయనున్నారా.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సంక్రమణ భయం రేపుతోంది. ఈసారి ఢిల్లీ స్కూల్స్‌ను వెంటాడుతోంది. ఢిల్లీ స్కూల్స్ నుంచి భారీగా చిన్నారులు కరోనా బారిన పడుతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు..ఏకంగా 53 మంది చిన్నారులు కరోనా సోకి ఆసుపత్రుల్లో చేరారు. ఈ నేపధ్యంలో ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్స్‌ని పాక్షికంగా మూసివేయాలని నిర్ణయించింది.


ఢిల్లీలోని వివిధ స్కూల్స్ నుంచి కరోనా కారణంగా ఇప్పటికే 53 మంది చిన్నారులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా..నిన్న మరో 14 మంది విద్యార్ధులకు కరోనా పాజిటివ్ గా తేలడంతో ఢిల్లీ కళావతి సరన్ ఆసుపత్రిలో చేర్చారు. వీరిలో ఎక్కువమంది ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. చిన్నారులకు కరోనా సోకుతుండటంతో ఢిల్లీ పాఠశాలల్ని పాక్షికంగా మూసివేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. స్కూల్స్ మూసివేయడమనేది ఎప్పుడూ చివరి ప్రయత్నమని చెప్పారు.


ఇక ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో ఢిల్లీలో కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. అటు పాజిటివిటీ రేటు కూడా 3.95 శాతానికి పెరిగింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం సూచిస్తోంది. 


Also read: PM Kisan Nidhi: అన్నదాతలకు గుడ్ న్యూస్, ఈ నెలలోనే 11వ విడత పీఎం కిసాన్ నిధి డబ్బులు, ఎలా చెక్ చేసుకోవాలంటే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook