Delhi Snooping Case: సీబీఐ విచారణ ఎదుర్కోనున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ప్రాసిక్యూషన్‌కు అనుమతి
Delhi Snooping Case: మొన్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు..ఇప్పుడు మరో కేసు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఇబ్బందులు తప్పడం లేదు. ఓ కేసులో ఆయన్ని విచారించేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ అనుమతి జారీ చేసింది. మనీష్ సిసోడియాను ఏ కేసులో ప్రాసిక్యూట్ చేయనున్నారు, ఆ కేసు వివరాలేంటో తెలుసుకుందాం..
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు కాదిప్పుడు. మరో కేసులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్న సీబీఐ..త్వరలో ప్రాసిక్యూట్ చేసేందుకు సిద్ధమౌతోంది.
ఢిల్లీ ఆప్ ప్రభుత్వంపై సీబీఐ మరోసారి దృష్టి సారించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు నడుస్తుండగానే..మరో కేసులో చిక్కుకుంది ప్రభుత్వం. అవినీతి నిరోధక చట్టంలో భాగంగా ఢిల్లీలోని ఫీడ్‌బ్యాక్ యూనిట్ స్నూపింగ్ కేసులో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా విచారణ ఎదుర్కోనున్నారు. ఈ కేసులో మనీష్ సిసోడియాను విచారించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరిని సీబీఐకు సంబంధిత అనుమతిని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జారీ చేసింది. మనీష్ సిసోడియాను ప్రాసిక్యూట్ చేసేందుకు సీబీఐ కోరిన అనుమతిని మంజూరు చేసిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపించారు.
ఏం జరిగింది
ఢిల్లీ విజిలెన్స్ శాఖకు అధిపతిగా ఉన్న మనీష్ సిసోడియాపై ఎఫ్ఐఆర్ నమోదుకు అనుమతి కోరింది సీబీఐ. వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రతిపక్ష పార్టీల నేతలు, సంస్థలపై గూఢచర్యం చేసేందుకు ఆప్ ప్రభుత్వం 2015లో రహస్యంగా ఫీడ్‌బ్యాక్ యూనిట్‌ను రాజ్యాంగ విరుద్ధంగా అదనంగా ఏర్పాటు చేసింది. ఈ స్నూపింగ్ యూనిట్..శాసన, న్యాయ పర్యవేక్షణ లేకుండా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితులు, సలహాదారుల పర్యవేక్షణలో నడుస్తుంది. సీక్రెట్ సర్వీస్ ఫండ్ పేరుతో ఎఫ్‌బీయూకు అక్రమంగా, అనధికారికంగా నిధులు కేటాయించడానికి సంబంధించింది కూడా. ఈ స్నూపింగ్ విభాగానికి నేతృత్వం వహించింది మనీష్ సిసోడియానే.
ఢిల్లీ స్నూపింగ్ కేసు అంటే ఏమిటి
2015లో ఆప్ అధికారంలో వచ్చిన తరువాత ఆ ప్రభుత్వం రాజకీయ గూఢచర్యానికి పాల్పడిందని సీబీఐ ఆరోపించింది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఫీడ్‌బ్యాక్ యూనిట్ ద్వారా ఈ స్నూపింగ్ వ్యవహారం జరిగిందనేది ఆరోపణ. దీని ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలు, రాజకీయ సంస్థలపై నిఘా పెట్టినట్టు సీబీఐ ఆరోపిస్తోంది. ఓ అధికారి ఫిర్యాదు మేరకు సీబీఐ ఈ విచారణ ప్రారంభించింది. ఫీడ్‌బ్యాక్ యూనిట్‌లో పలు అవకతవకల్ని గుర్తించిన ఢిల్లీ విజిలెన్స్ విభాగం సూచనల మేరకు ప్రాధమిక విచారణ నమోదైంది.ఈ వ్యవహారంపై తదుపరి విచారణకై సీబీఐ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ను కోరగా, ఆయన రాష్ట్రపతికి అభ్యర్ధించారు.
ఆరోపణల్ని కొట్టిపారేసిన ఆప్
అయితే ఈ ఆరోపణల్ని ఆప్ ప్రభుత్వం కొట్టిపారేసింది. రాజకీయ స్నూపింగ్‌లో మనీష్ సిసోడియా ఉన్నారంటూ బీజేపీ చేసిన ఆరోపణ అర్ధం లేనిదని..సత్య దూరమని ..ఈ కేసులన్నీ కుట్ర పూరితమని ఆప్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇప్పటి వరకూ సీబీఐ, ఈడీ, ఢిల్లీ పోలీసులు తమపై 163 కేసులు నమోదు చేశారని ఆప్ వెల్లడించింది. అయినా ఒక్క కేసును కూడా బీజేపీ ప్రభుత్వం రుజువు చేయలేకపోయిందని తెలిపింది. ఇందులో 134 కేసుల్ని కోర్టులు కొట్టివేశాయన్నారు. మిగిలిన కేసుల్లో కూడా ఏవిధమైన ఆధారాలు సమర్పించలేకపోయిందని ఆప్ స్పష్టం చేసింది. ఈ కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమైనవవి వెల్లడించింది.
Also read: Aadhaar Card Update: ఆధార్‌లో కీలక మార్పులు.. ఎన్నిసార్లు అప్‌డేట్ చేసుకోవచ్చో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook