నేటి నుంచి యూరో6 ఇంధన విక్రయం
ఢిల్లీ మరో ప్రయోగానికి సిద్ధమైంది.
ఢిల్లీ మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఢిల్లీలో కాలుష్యం తగ్గించేలా అన్ని పెట్రోలు బంకుల్లో అల్ట్రాక్లీన్ యూరో 6 ప్రమాణాలు కలిగిన పెట్రోలు, డీజిల్ విక్రయం ఇవాళ ప్రారంభంకానుంది. కాలుష్యాన్ని తగ్గించే ఈ ఇంధన ఉత్పత్తికి కంపెనీలకు అదనపు ఖర్చవుతుంది. ఫలితంగా దేశంలో ఈ తరహా ఇంధనం విక్రయించనున్న తొలి నగరంగా ఢిల్లీ రికార్డులకెక్కనుంది.
హైదరాబాద్, పూణే, నోయిడా, చెన్నై, ముంబై, చెన్నై, బెంగళూరు సహా ఇతర ప్రధాన నగరాల్లో వచ్చే ఏడాది జనవరి నుంచి యూరో-6 గ్రేడ్ ఇంధనం అందుబాటులోకి రానుందట. ఏప్రిల్ 2020 నాటికి దేశంలోని అన్ని పెట్రోలు బంకుల్లో ఈ తరహా ఇంధనం లభించనుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే రాజధానిలోని 391 పెట్రోలు బంకుల్లోనూ ఏప్రిల్-1 నుంచి ఈ ప్రమాణాలు కలిగిన పెట్రోలు, డీజిల్‌ను విక్రయించనున్నట్టు ఐఓసీఎల్ డైరెక్టర్ బీవీ రామగోపాల్ తెలిపారు.
అల్ట్రాక్లీన్ ఇంధనాన్ని ఉత్పత్తి చేసేందుకు చమురు కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినప్పటికీ వినియోగదారులపై మాత్రం ఎటువంటి భారాన్ని మోపడం లేదని ఆయన తెలిపారు. దేశమంతట ఈ ఇంధనం అందుబాటులోకి వచ్చాక ధరల పెంపుపై ఆలోచిస్తామని ఆయన తెలిపారు.