Delhi Traffic Cop Suspended: మనం వాహనాలు నడిపే సమయంలో కచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. మధ్యలో ట్రాఫిక్ పోలీస్ మన వాహనాన్ని ఆపితే.. అన్ని డాక్యుమెంట్లను చూపించాల్సి ఉంటుంది. ఏది మిస్ అయినా జరిమానా చెల్లంచాల్సిందే. మీరు జరిమానా చెల్లించిన సమయంలో ట్రాఫిక్ పోలీసు అందుకు సంబంధించిన రసీదు మీ చేతికి ఇస్తారు. ఆ రసీదు మీకు ఇస్తేనే.. ఆ డబ్బులు ప్రభుత్వ ఖాతాలోకి వెళుతుంది. రసీదు లేకుండా ఫైన్ చెల్లిస్తే.. అది వసూలు చేసిన వాళ్ల జేబుల్లోకి వెళుతుంది. ఇలా రసీదు లేకుండా ఓ విదేశీయుడు వద్ద డబ్బులు తీసుకున్న ఓ పోలీస్ సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఉన్నతాధికారులు అతడిని విధుల నుంచి తప్పించారు. ఆయన డబ్బులు తీసుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పూర్తి వివరాలు ఇలా..
 
కొరియా దేశానికి చెందిన ఓ వ్యక్తి ఢిల్లీలో రోడ్డు సైడ్‌కు కారు ఆపుకుని నిలబడ్డాడు. ఇంతలో కారు వద్దకు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసు మహేశ్ చంద్ అక్కడికి వచ్చాడు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఫైన్ చెల్లించాలని కొరియన్‌కు చెప్పాడు. దీంతో రూ.500 నోటు తీసుకుని ఇచ్చాడు. అయితే రూ.500 కాదు.. రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ఆ విదేశీయుడు ఏం చేయలేక ట్రాఫిక్ పోలీస్ అడిగిన రూ.5 వేలను ఇచ్చేశాడు. ఈ డబ్బులు తీసుకున్న మహేశ్ చంద్.. ఎలాంటి రసీదు ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన అంతా కారులోని కెమెరాలో రికార్డు అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఉన్నతాధికారులు స్పందించారు. ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ట్రాఫిక్ పోలీసును వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేశారు. శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


 




విచారణకు హాజరైన మహేశ్ చంద్.. తాను చలాన్ రశీదు ఇవ్వబోతున్నానని పేర్కొన్నాడు. అయితే కారు యజమాని అక్కడి నుంచి వెళ్లిపోయాడని చెప్పాడు. అయితే వీడియోలో ట్రాఫిక్ పోలీసు రసీదు ఇచ్చే ఉద్దేశంతో కనిపించలేదు. డబ్బులు ఇచ్చిన కొరియన్.. మహేశ్‌ చంద్‌తో మాట్లాడి ధన్యవాదాలు చెప్పాడు. చివరికి షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.


 



 


Also Read: Bank Holiday August 2023: ఆగస్టు నెలలో 14 రోజులు బ్యాంకులు బంద్.. సెలవుల జాబితా ఇదే..!  


Also Read: CM Jagan Mohan Reddy: రాష్ట్ర చరిత్రలోనే ప్రత్యేకతంగా నిలిచిపోయే రోజు: సీఎం జగన్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి