Delhi Traffic Police Fines: బైక్‌కు రూ.500 పెట్రోల్ కొట్టించుకునేందుకు వెళితే పది వేల రూపాయల ఫైన్ పడింది. ఎందుకు అని ఆశ్చర్యపోతున్నారా..? ఈ ఘటన ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. పెట్రోల్ బంక్‌లో సీసీ కెమెరాలో వెహికల్ నంబరు ఆధారంగా ఫైన్లు వేస్తున్నారు. ఢిల్లీలో పీయూసీ సర్టిఫికెట్ లేకపోతే ట్రాఫిక్ పోలీసులు రూ.10 వేల వరకు జరిమానా విధిస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వ రవాణా శాఖ పీయూసీ సర్టిఫికెట్‌ లేని వాహనాలపై ప్రత్యేక దృష్టిపెట్టింది. సీసీ కెమెరాల ద్వారా కాలుష్య కారక వాహనాలను నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలోనే చలాన్లు విధించేందుకు వినూత్నంగా ప్లాన్ వేశారు. ఢిల్లీలోని నాలుగు పెట్రోల్ పంపుల నుంచి పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. పెట్రోల్ లేదా డీజిల్ పోయించుకునేందుకు పెట్రోల్ బంక్‌లకు వచ్చినప్పుడు రవాణా శాఖ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో వాహనాల నంబర్లను చెక్ చేస్తున్నారు. వాటిలో పొల్యూషన్ అండర్ చెక్ సర్టిఫికెట్ (పీయూసీ) ఉందా లేదా అని తెలుసుకుంటున్నారు. పీయూసీ సర్టిఫికెట్ లేని వాహనాలకు రూ.10 వేలు ఆన్‌లైన్‌లో చలాన్లు విధిస్తున్నారు.


ఢిల్లీ రవాణా శాఖ పైలట్ ప్రాజెక్ట్‌గా చిన్నస్థాయిలో ప్రారంభించింది. ఇది విజయవంతం కావడంతో రానున్న రోజుల్లో ఇతర పెట్రోల్ పంపులలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్‌లో ప్రారంభించిన ఒక నెలలోనే దాదాపు 800 చలాన్లు విధించారు. అయితే ఇందుకు సంబంధించి ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. 


రానున్న కాలంలో ఢిల్లీ రాజధానిలో మరో 25 పెట్రోల్ బంక్‌ల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఆ తరువాత రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు విస్తరించే ప్లాన్‌లో ఉన్నారు. దీంతో పీయూసీ సర్టిఫికెట్ లేకుండా పెట్రోల్ బంక్‌కు వచ్చే వాహనదారుల్లో భయం నెలకొంది. పీయూసీ లేకపోతే ఆటోమెటిక్‌కు బండిపై ఫైన్ పడుతుంది. వాహనాల కాలుష్యాన్ని నివారించే లక్ష్యంతో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారు.


Also Read: Bathukamma Festival Special: బతుకమ్మ పండుగ స్పెషల్.. ఈ పూలలో దాగిన ఔషధ గుణాలు ఎన్నో..!  


Also Read: TCS Recruitment: టీసీఎస్ కంపెనీ గుడ్‌న్యూస్.. 40 వేల మంది నియామకాలకు రెడీ..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి