Delhi: Woman shoots husband dead with help of paramour in Mangolpuri: ఇష్టం లేని పెళ్లి చేశారంటూ ఓ మహిళ ప్రియుడితో తన భర్తనే చంపించింది. ఈ ఘటన న్యూఢిల్లీలో జరిగింది. ఈ సంఘటన నవంబర్ 2న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగోల్‌పురి (Mangolpuri) ఇండస్ట్రియల్ ఏరియా సమీపంలోని ఇది జరిగింది.నిందితురాలు ఇరవై ఏళ్ళ ఊర్మిళకు (Urmila) ఆటో రిక్షా డ్రైవర్ (auto-rickshaw driver) అయిన రాజ్ కుమార్‌తో ఇష్టం లేకుండా పెళ్లి చేశారు. పెళ్లి అయినప్పుటి నుంచీ ఆమె తన వివాహం విషయంలో అసంతృప్తిగా ఉండేది. అయితే రాజ్ కుమార్ ఆమెను వేధించేవాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : LIVE SCORE UPDATES: పాకిస్తాన్ Vs ఆస్ట్రేలియా 2nd సెమీ ఫైనల్ LIVE


ఈ నేపథ్యంలో ఊర్మిళ ఒక యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పరుకుంది. తర్వాత వారిద్దరు కలిసి రాజ్ కుమార్‌‌ని అడ్డు తొలగించుకోవాలని డిసైడ్‌ అయ్యారు. ప్లాన్ ప్రకారం ఖాన్ మంగోల్‌పురి ఇండస్ట్రియల్ ఏరియా ఫేజ్ వన్‌కి ( Mangolpuri Industrial area phase I) వెళ్లడానికి ప్రయాణీకుడిగా రాజ్ కుమార్ (Raj Kumar) రిక్షా ఎక్కాడు ఊర్మిళ బాయ్ ఫ్రెండ్ (boyfriend). కొంత దూరం వెళ్ళాక ఎవరూ లేని ప్రాంతంలో ఆపమని రాజ్ కుమార్ ను అతను అడిగాడు. ఆ తర్వాత రాజ్ కుమార్‌ని (Raj Kumar) అంతం చేసేందుకు కొనుగోలు చేసిన కంట్రీ మేడ్ పిస్టల్‌తో (country-made pistol) అతని వీపుపై కాల్చాడు. 


Also Read : Forced marriage : ప్రేమికులను బంధించి పెళ్లి చేసి అసభ్యకరంగా ప్రవర్తించిన యువకులు


పోలీసులు ( police) కేసు (case) దర్యాప్తు చేపట్టగా ఈ నిజాలన్నీ బయటపడ్డాయి. తన భర్తతో కలిసి ఉండడం ఇష్టం లేకనే తన ప్రియుడు ఖాన్ సహాయంతో రాజ్‌ కుమార్‌‌ని చంపినట్లు (murdered) ఊర్మిళ ఒప్పుకుంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook