Zomato Delivery Boy: కష్టపడ్డా.. ఫుడ్ డెలివరీ చేశా.. సివిల్స్ జాబ్ కొట్టా.. జొమాటో డెలివరీ బాయ్ విజయగాథ
Zomato Delivery Boy Clears TNPSC: జొమాటో డెలవరీ బాయ్‌గా పనిచేస్తూ.. తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు ఓ యువకుడు. కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సాధించిన ఈ యువకుడిపై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆ విజయగాథ మీ కోసం..
Zomato Delivery Boy Clears TNPSC: 'కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి' అని మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్ కలా ఏనాడో చెప్పారు. కలలు కనడమంటే ఊహాలలో విహరించడం కాదని.. గాలిలో పేక మేడలు కట్టడం కాదని చెప్పారు. ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకొని.. ఆ లక్ష్య సాధన కోసం ఎంతైనా శ్రమించాలని సూచించారు. ఆయన చెప్పిన మాటలను నిజం చేశాడు ఓ ఫుట్ డెలివరీ బాయ్. సాధించాలనే సంకల్పం ఉంటే.. ఎన్ని అవరోధాలు ఎదురైనా విజేతగా నిలవచ్చని నిరూపించాడు. తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు జొమాటో డెలివరీ బాయ్ విఘ్నేష్. లక్షలా మంది అభ్యర్థుల నుంచి పోటీని ఎదుర్కొని విజేతగా నిలిచాడు. ఈ విజయగాథను జొమాటో సంస్థ సోషల్ మీడియా పంచుకుంది.
విఘ్నేష్ అనే యువకుడు ఆర్థిక కష్టాల నేపథ్యంలో జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేశాడు. మరోవైపు తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఎప్పుడు వెనకడుగు వేయలేదు. ఓ వైపు డెలివరీ బాయ్‌గా పనిచేస్తూనే.. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యాడు. ఈ క్రమంలోనే తమిళనాడు సివిల్ సర్వీసెస్ పరీక్ష రాశాడు. ఈ నెల 12న ఫలితాలు విడుదలవ్వగా.. విఘ్నేష్ ఉత్తీర్ణత సాధించాడు.
'జొమాటో డెలివరీ పార్టనర్‌గా పనిచేస్తున్నప్పుడు తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విఘ్నేష్‌కి హృదయపూర్వకంగా ఒక లైక్ ఇవ్వండి' అంటూ హార్ట్ ఎమోజీతో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. విఘ్నేష్‌పై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. హ్యాట్సాఫ్ చెబుతూ.. అభినందనలు చెబుతున్నారు. పట్టుదల, సాధించాలనే తపన ఉంటే.. ఏదైనా సాధ్యమేనని అంటున్నారు. ఇక నుంచి విఘ్నేష్ ప్రభుత్వ ఆర్డర్‌లపై సంతకాలు చేస్తాడంటూ పొగుడుతున్నారు. ఈ ట్వీట్‌ను 67 వేల మంది వీక్షించగా.. 3 వేల మందికిపైగా లైక్ చేశారు. 150కి పైగా రీట్వీట్స్ వచ్చాయి.
Also Read: Bank Holiday August 2023: ఆగస్టు నెలలో 14 రోజులు బ్యాంకులు బంద్.. సెలవుల జాబితా ఇదే..!
Also Read: IND vs WI Highlights: ఒక్క బంతి పడలేదు.. వరుణుడి ఖాతాలోకి విజయం.. రెండో టెస్టు డ్రా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook