Saif ali khan praises Rahul Gandhi as a brave and honest video: దేవర మూవీ ఈ రోజు రిలీజ్ అయి రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, జాన్వీకపూర్ దీనిలో జోడిగా నటించారు. అదే విధంగా సైఫ్ అలీఖాన్ కూడా విలన్ గా అదరగొట్టాడు. కొరటాల శివ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ఇదిలా ఉండగా..దేవర నటుడు సైఫ్ అలీఖాన్ ఇటీవల ఒక మీడియా సమావేశంలో రాహుల్ గాంధీని ప్రశంసలతో ముంచెత్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఒకప్పుడు రాహుల్ గాంధీకి, ఇప్పుడు మనకు కన్పిస్తున్న రాహుల్ జీకి చాలా తేడా ఉందని అన్నారు. ప్రధాని మోదీ, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కంటే.. తనకు ఎంపీ రాహుల్ గాంధీ ఫెవరేట్ పొలిటిషయన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


పూర్తి వివరాలు..


దేవర నటుడు సైఫ్ అలీఖాన్ ఇటీవల ఒక మీడియా నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దీనిలోమాట్లాడుతూ..దేశంలోని పలు రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంలోనే.. సదరు రిపోర్టర్.. మీకు ఇష్టమైన పొలిటిషియన్ ఎవరు అంటూ క్వశ్చన్ చేశారు. పీఎం మోదీ, కేజ్రీవాల్, రాహుల్ గాంధీ వీరిలో మీ ఫెవరేట్ రాజకీయ వేత్త ఎవరని అడిగారు. దీంతో సైఫ్ అలీఖాన్ ఈ ముగ్గురు కూడా గొప్ప మేధస్సు ఉన్న రాజకీయ నాయకులని చెప్పాడు.


అంతేకాకుండా.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన ఫెవరేట్ పొలిటిషియన్ అని కూడా చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా.. ఆయన భారత్ జోడోయాత్రలు చేపట్టి దిమ్మతిరిగే ఫాలోయింగ్ ను సంపాదించారన్నారు. పాదయాత్రలో పలు ప్రసంగాలు జనాల్లోకి వెళ్లాయన్నారు. ఒకప్పుడు ఆయనను ప్రజలు, రాజకీయ నాయకులు.. ఏగతాళి చేసేలా మాట్లాడేవారని, కానీ ఇప్పుడు మాత్రం రాహుల్ గాంధీ ఎంతో మారారని ఆయన మాటలు వింటుంటే చాలా ఇన్ స్పైరింగ్ గా అనిపిస్తుందని కూడా సైఫ్ అలీఖాన్ అన్నాడు.


Read more: Viral Video: ఛీ..ఛీ ఎంత ఘోరం.. పట్టపగలే బైక్‌పై ముద్దులతో రెచ్చిపోయిన ప్రేమజంట.. వీడియో వైరల్..


దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా... గతంలో..కరీనా కపూర్ సైతం.. రాహుల్ గాంధీ తన ఫెవరేట్ పొలిటియన్ అంటూ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇప్పుడు ఆమె భర్త సైఫ్ అలీఖాన్ కూడా అదే మాట చెప్పడంతో.. వీరి టెస్టులు భలే ఉన్నాయంటూ కూడా ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.