మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, శివ సేన పార్టీ ఎంపీ, కీలక నేత అయిన సంజయ్ రౌత్ ( Devendra Fadnavis, Sanjay Raut meeting ) శనివారం ముంబైలోని ఓ లగ్జరీ హోటల్లో వీళ్లిద్దరూ సమావేశం కావడం రాజకీయవర్గాల్లో చర్చనియాంశమైంది. బీజేపి అంటేనే ఒంటికాలుపై లేస్తున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ( Shiv Sena MP Sanjay Raut ) ఇలా బీజేపి కీలక నేతతో రహస్య మంతనాలు ఏంటా అని అందరూ ఆశ్చర్యపోయారు. ఐతే బీజేపి మాత్రం వీళ్ల భేటీకి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టంచేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శివ సేనకు చెందిన సొంత పత్రిక సామ్నా ( Saamna ) కోసం దేవేంద్ర ఫడ్నవీస్ నుండి సంజయ్ రౌత్ ఓ ఇంటర్వ్యూ తీసుకోవాలనుకున్నారని.. అందులో భాగంగానే ఈ భేటీ జరిగిందని మహారాష్ట్ర బీజేపి ముఖ్య అధికార ప్రతినిధి కేశవ్ ఉపాధ్యే తెలిపారు. బీహార్ ఎన్నికల ప్రచారం నుంచి తిరిగొచ్చాక తాను ఇంటర్వ్యూ ఇస్తానని దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారని కేశవ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. 


మరోవైపు సంజయ్ రౌత్ ఈ విషయంపై స్పందిస్తూ... దేవేంద్ర ఫడ్నవిస్‌ని కలవడం ఏమైనా నేరమా అని ప్రశ్నించారు. ''ఆయన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కావడమే కాకుండా ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు కూడా'' అని అభిప్రాయపడిన సంజయ్ రౌత్.. ''తాను శరద్ పవార్‌ని ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడే.. భవిష్యుత్తులో ఫడ్నవీస్ ( Sanjay Raut interview with Devendra Fadnavis ), రాహుల్ గాంధీ, అమిత్ షాల ఇంటర్వ్యూలు కూడా తీసుకుంటానని చెప్పాననే విషయాన్ని రౌత్ గుర్తుచేసుకున్నారు.