Flight Emergency Exit Door: ప్రయాణికుడు విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచిన ఘటనపై డిజిసిఏ విచారణకు ఆదేశం
Indigo Flight Emergency Exit Door: విమానం బోర్డింగ్ ప్రక్రియలో ఉన్న సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటన విమానంలోని ప్రయాణికులను ఆందోళనకు గురయ్యేలా చేసింది. ఇంకొంతమందికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక తీవ్ర గందరగోళానికి గురయ్యారు.
Indigo Flight Emergency Exit Door: విమానం టేకాఫ్ కావాల్సి ఉండగా ఒక ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఓపెన్ చేసిన ఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణకు ఆదేశించింది. గతేడాది డిసెంబర్ 10న తిరుచిరాపల్లి నుంచి చెన్నై బయల్దేరాల్సి ఉన్న ఇండిగో విమానంలో ఈ ఘటన జరిగింది. ఇండిగో ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరవడాన్ని గుర్తించిన విమానం సిబ్బంది వెంటనే అతడిని నిలువరించడంతో పాటు తిరిగి డోర్‌ని మూసేసి, ఆ తరువాత అన్ని సాంకేతిక పరీక్షలు పూర్తి చేసిన తరువాతే విమానం టేకాఫ్ అయింది. ఈ ఘటన కారణంగా విమానం ఆలస్యమైంది.
విమానం బోర్డింగ్ ప్రక్రియలో ఉన్న సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటన విమానంలోని ప్రయాణికులను ఆందోళనకు గురయ్యేలా చేసింది. ఇంకొంతమందికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక తీవ్ర గందరగోళానికి గురయ్యారు. ఈ ఘటనపై ఇండిగో ఎయిర్ లైన్స్ స్పందిస్తూ.. ప్రయాణికుడు పొరపాటున విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచాడని.. ఎమర్జెన్సీ డోర్ మూసేసిన తరువాత విమానం డిపార్చర్ కావడానికి ముందు సాంకేతికంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అని స్పష్టంచేసింది.
తాను తెలియక పొరపాటున ఎమర్జెన్సీ డోర్ తెరిచానని.. తన కారణంగా కలిగిన అసౌకర్యానికి సదరు ప్రయాణికుడు క్షమాపణలు చెప్పారని ఇండిగో ఎయిర్ లైన్స్ తేల్చిచెప్పింది. ఏవియేషన్ ఇండస్ట్రీని కలవరపాటుకు గురిచేసిన ఈ ఘటన ప్రస్తుతం చర్చనియాంశమైంది.
ఇది కూడా చదవండి : Mahindra XUV400 EV: మహింద్రా నుంచి మరో కొత్త బాహుబలి.. ఒక్కసారి రీచార్జ్ చేస్తే 456 కిమీ రేంజ్
ఇది కూడా చదవండి : Filght Ticket Offers: ఫ్లైట్ టికెట్స్‌పై బంపర్ ఆఫర్.. దేశంలో ఎక్కడికైనా రూ.1199కే ప్రయాణం
ఇది కూడా చదవండి : Salary Hikes in 2023: జీతాల పెంపుపై ప్రైవేటు ఉద్యోగులకు పెద్ద గుడ్ న్యూస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook