కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అంతర్జాతీయ ప్రయాణీకుల విమానాల సర్వీసులపై ఫిబ్రవరి 28 వరకు నిషేధం పొడిగించారు. ఈ మేరకు భారత ఏవియేషన్ రెగ్యులేటర్ బాడీ డీజీసీఏ గురువారం తెలిపింది. అయితే, అంతర్జాతీయంగా షెడ్యూల్ షెడ్యూల్ చేసిన విమానాలను కొన్ని ఎంపిక చేసిన మార్గాల్లో కేస్-టు-కేస్ ప్రాతిపదికన అనుమతించనున్నామని సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ ఒక ప్రకటనలో తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అంతర్జాతీయ కార్గో ఆపరేషన్స్ మరియు ప్రత్యేకంగా ఆమోదించబడిన విమానాల సర్వీసులకు ప్రస్తుత నిర్ణయం అమలు కాదని డీజీసీఏ(Directorate General of Civil Aviation) సర్క్యులర్ పేర్కొంది. కరోనా వ్యాప్తి  కారణంగా మార్చి 23, 2020 నుండి భారతదేశంలో షెడ్యూల్ చేయబడిన అంతర్జాతీయ ప్రయాణ సేవలు నిలిపివేస్తున్నారు.


Also Read: WhatsApp Chat: మీ వాట్సాప్ ఛాటింగ్ డేటాను Telegram Appకు ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకోండి



కొన్ని ప్రత్యేక అంతర్జాతీయ విమానాలు వందే భారత్ మిషన్ కింద.. కేవలం కొన్ని దేశాలలో ఉండిపోయిన వారిని స్వదేశానికి తరలిస్తున్నారు. అదే సమయంలో భారత్ నుంచి విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు, ఇతర పనులు చేసుకోవాలనుకున్న వారిని ఈ మిషన్ కింద COVID-19 ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని డీజీసీఏ తరలించడం తెలిసిందే.


Also Read: Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో మళ్లీ దిగొచ్చిన బంగారం ధరలు, రూ.4700 పతనమైన Silver Price



అమెరికా, యూకే, కెన్యా, భూటాన్, యూఏఈ మరియు ఫ్రాన్స్‌ సహా దాదాపు 24 దేశాలతో భారతదేశం ఎయిర్ బబుల్ ఒప్పందాలు చేసుకుంది. ఈ దేశాలతో ఉన్న వాయు ప్రయాణ ప్రత్యేక ఒప్పందం ప్రకారం, ఈ దేశాలకు కొన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను కొనసాగిస్తోంది.


Also Read: SBI MF Retirement Benefit Scheme: మ్యూచువల్ ఫండ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ ప్రారంభించిన SBI 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook