Covid Medicine: కోవిడ్ మహమ్మారిని అరికట్టే క్రమంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కీలకమైన అడుగేసింది. కరోనా వైరస్‌కు కనిపెట్టిన మందుకు డీజీసీఐ అత్యవసర అనుమతి జారీ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారిని (Corona Virus) అంతం చేసేందుకు నిరంతరం పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే డీఆర్డీవో(DRDO), డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్(Dr Reddys Labs) సంయుక్తంగా ఢిల్లీలోని ఐఎన్ఎంఏఎస్  ల్యాబ్‌లో యాంటీ కరోనా డ్రగ్‌ను అభివృద్ధి చేశాయి.ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ ఎల్లైడ్ సైన్సెస్ ల్యాబొరేటరీలో తయారైన ఈ మందు క్లినికల్ ట్రయల్స్ (Clinical trials) ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ ఫలితాలు అద్భుతంగా ఉండటంతో అత్యవసర ఉపయోగం కోసం యాంటీ కోవిడ్ 2 డియోక్సీ డి గ్లూకోజ్( Covid 2 Deoxy De Glucose) మందుకు డీజీసీఐ అనుమతి ఇచ్చింది. కోవిడ్ తీవ్రంగా ఉన్న రోగులకు ఈ మందు అమోఘంగా పనిచేస్తోందని..వేగంగా కోలుకోవడంతో పాటు ఆక్సిజన్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని డీఆర్డీవో తెలిపింది.


ఈ మందు గ్లూకోజ్ రూపంలో ఉంటుంది. దేశంలో దీన్ని సులభంగా ఉత్పత్తి చేయడంతో పాటు విరివిగా అందుబాటులో తీసుకురావచ్చని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్(Dr Reddys labs) చెబుతోంది. ఈ మందు సాచెట్లలో పొడిరూపంలో లభించనుంది. నీటిలో కరిగించి నోటితో తీసుకోవాలి. వైరస్ వ్యాపించిన భాగాల్లో చేరి అక్కడి సెల్స్‌లో ఉన్న కరోనా శక్తిని అడ్డుకోవడంతో పాటు విస్తరణను గణనీయంగా తగ్గిస్తుంది. ఐఎన్ఎంఏఎస్ - డీఆర్డీవో శాస్త్రవేత్తలు సీసీఎంబీ (CCMB)సహాయంతో చేసిన ప్రయోగాల్లో వైరస్‌కు వ్యతిరేకంగా ఈ మందు సమర్ధవంతంగా పని చేస్తున్నట్టు తేలింది. 2020 డిసెంబర్-2021 మార్చ్  మధ్య కాలంలో 220 మంది రోగులపై మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, మహారాష్ట్ర , ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, గుజరాత్‌లకు చెందిన 27 కోవిడ్ ఆసుపత్రుల్లో ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఈ ఫలితాల ఆధారంగా డీజీసీఐ (DGCI) అనుమతిచ్చింది.


Also read: Vaccine for Children: కోవిడ్ ఉధృతి నేపధ్యంలో చిన్నారులకు కూడా వ్యాక్సిన్ అవసరం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook