Dhanbad Fire Accident News: జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ధన్‌బాద్‌లోని ఆశిర్వాద్ అనే రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో మంటలు అంటుకుని భవనం మొత్తానికి అగ్నికీలలు వ్యాపించాయి. మంగళవారం సాయంత్రం చీకటిపడే సమయంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో 14 మంది చనిపోయినట్టుగా ప్రాథమిక సమాచారం అందుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కడపటి వార్తలు అందే సమయానికి అర్థరాత్రి దాటే సమయంలోనూ రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. అగ్ని ప్రమాదం తీవ్రత చూస్తోంటే.. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని స్థానిక అధికారవర్గాలు తెలిపాయి. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయితే కానీ మృతుల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. 



 


ఆశిర్వాద్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం ఘటనపై కేసు నమోదు చేసుకున్న ధన్‌బాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఓవైపు సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తూనే మరోవైపు ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ధన్‌బాద్ అగ్ని ప్రమాదం ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


ఇది కూడా చదవండి : Supreme Court Judges: ఇద్దరు జడ్జిలకు సుప్రీం కోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఎందుకంటే..


ఇది కూడా చదవండి : 8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ న్యూస్.. బడ్జెట్‌లో కేంద్రం భారీ ప్రకటన..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook