Dhanya Lakshmi Scheme: మహిళలకు గుడ్ న్యూస్.. మోదీ సర్కార్ కొత్త స్కీమ్
Union Budget 2020 । మహిళల సాధికారత కోసం ప్రధాని మోదీ సర్కార్ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ధాన్యలక్ష్మీ అనే స్కీమ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల మహిళలకు బాధ్యతలు అప్పగించింది.
ఎన్నో ఆశలు, అంచనాల మధ్య కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికిగానూ బడ్జెట్ ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2020ను శనివారం నాడు ప్రవేశపెట్టిన అనంతరం ప్రసంగించారు. వ్యవసాయ, విద్యా రంగాలతో గ్రామీణ ప్రాంతాలై స్పెషల్ ఫోకస్ చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. స్వయం సహాయక సంఘాలు (SHG) కోసం ధాన్యలక్ష్మీ అనే కొత్త పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) విలేజ్ స్టోరేజ్‌ల బాధ్యతను నిర్వహిస్తాయి.
మహిళల్ని ధాన్యలక్ష్మీగా తీర్చిదిద్దే క్రమంలో ప్రభుత్వం వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా గ్రామీణ ప్రాంతాల మహిళలతో పాటు రైతులకు మేలు జరగనుంది. ధాన్యలక్ష్మీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో గిడ్డంగుల (గోదాములు)ను నిర్మిస్తారు. మహిళల ఎస్‌హెచ్‌జీలకు రైతులకు కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది. రైతులు పండించిన పంటను ఎస్‌హెచ్‌జీల సహకారంలతో విలేజ్ స్టోరేజ్‌లలో నిల్వచేసుకుంటారు. నాబార్డుతో పాటు ముద్రా సంస్థలు స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందిస్తాయి.
చేపల పెంపకంతో యువతకు ఉపాధి
ప్రస్తుతం 53.5 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉన్న పాల ఉత్పత్తిని 2025 నాటికి దాదాపు రెట్టింపు (103) చేసే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లోని యువత సాగర్ మిత్రాలుగా పనిచేస్తూ నీలివిప్లంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని భావిస్తునన్నట్లు తెలిపారు.