మంగళవారం ఇంధన ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. రోజువారీ ధరల సవరణలో భాగంగా వరుసగా మూడో రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను చమురు కంపెనీలు పెంచాయి. దీంతో డీజిల్ రాకెట్ లో దూసుకుపోయి రికార్డు స్థాయిలో ధరను


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నమోదు చేసింది. పెట్రోల్ ధర కూడా పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ ధర లీటర్‌పై 14పైసలు, డీజిల్‌ ధర లీటర్‌పై 15 పైసలు పెరిగింది. పెరిగిన ధరలు మంగళవారం నేటి ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చింది.


ఇండియన్ ఆయిల్ లిమిటెడ్ కార్పొరేషన్ (ఐఓసీ) ప్రకారం.. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.78.05ను తాకింది. ఇక ముంబయిలో రూ. 85.47, కోల్‌కతాలో రూ. 80.98, చెన్నైలో రూ. 81.09గా ఉంది.


డీజిల్‌ ధర కూడా మంగళవారం రికార్డు స్థాయిని తాకింది. ఇవాళ  ఢిల్లీలో లీటర్‌ డీజిల్‌ ధర రూ. 69.61కి చేరింది. ముంబయిలో రూ. 73.90, కోల్‌కతాలో రూ. 72.46, చెన్నైలో రూ. 73.54గా ఉంది. (మూలం: ఐఓసీ వెబ్ సైట్)


అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో పాటు వెనుజువెలా ఆర్థిక సంక్షోభం, ఆఫ్రికా, ఇరాన్‌ దేశాల నుంచి సరఫరా తగ్గడంతో దేశీయంగా ఇంధన ధరలు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.


క్ర.సం నగరం  పెట్రోల్ ధర(రూ./లీటర్లలో)
1 ఢిల్లీ 78.05
2 ముంబయి 85.47
3 కోల్‌కతా 80.98
4 చెన్నై 81.09
4 హైదరాబాద్ ₹ 82.66