Diwali gift for common man! Excise duty on petrol, diesel slashed by up to Rs 10: దేశంలో రోజురోజుకు పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులుపడుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రజలకు దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెట్రోల్‌, డీజిల్‌లపై (petrol, diesel ) ఎక్సైజ్‌ సుంకం (Excise duty) తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. లీటరు పెట్రోల్‌పై (petrol) రూ.5లు, లీటరు డీజిల్‌పై (diesel) రూ.10 చొప్పున తగ్గిస్తున్నట్టు తెలిపింది. పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు రేపటి నుంచే అంటే నవంబర్‌‌ 4 నుంచి (November 4) అమల్లోకి రానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : Akhanda title song teaser: అఖండ టైటిల్ సాంగ్ టీజర్ వచ్చేస్తోంది


అలాగే ప్రజలకు మరింత ఉపశమనం కలిగించేందుకు రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించాలని కేంద్రం సూచించింది. ఇటీవల పెరుగుతున్న వచ్చిన ఇంధన ధరలు ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయికి చేరాయి. దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వానికి (Central Government) వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇక బుధవారం ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.110.04గా ఉండగా, డీజిల్ లీటర్‌ రూ.98.42, ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ రూ.115.85, డీజిల్‌ రూ.106.62 ధర పలికింది. కేంద్రం తాజా నిర్ణయంతో వాహనదారులకు కాస్త ఊరట కలుగనుంది.


Also Read : Bus Fall into Ravine: ఘోర ప్రమాదం.. లోయలో పడిపోయిన బస్సు... 22 మంది మృతి


ఇక డీజిల్‌పై (Diesel‌) ఎక్సైజ్‌ సుంకం (Excise duty) తగ్గింపు పెట్రోల్‌ కంటే రెట్టింపు ఉండటంతో రాబోయే రబీ సీజన్‌లో రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని, అలాగే, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ తగ్గిస్తే వినియోగదారులకు ఉపశమనం కలుగుతుందని కేంద్రం పేర్కొన్నట్టు సమాచారం.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook