Kali Mata Temple Prasad Money: ప్రసాదం బదులుగా డబ్బులు పంచిన పూజారి.. ఎగబడ్డ జనాలు!
Money offerings to devotees insted of prasad on Diwali Night at Kali Mata Temple. కాళీమాత ఆలయంలో దీపావళి పండగ సందర్భంగా సోమవారం రాత్రి 11 నుంచి 2 గంటల వరకూ పూజారి శక్తి మహారాజ్ భక్తులకు డబ్బులు పంచారు.
Devotees gets money as prasad on Diwali Night at Amravati Kali Mata Temple: ఈ ప్రపంచంలో భక్తులు ఏ గుడికి వెళ్లినా.. పూజారులు తీర్థప్రసాదాలు అందిస్తారు. దేవుడిని దర్శించుకున్న భక్తులు.. పూజారులు ఇచ్చే తీర్థప్రసాదాలు తింటారు. అయితే మహారాష్ట్రలోని అమరావతిలో ఉన్న కాళీమాత ఆలయంలో పూజారి భక్తులకు ప్రసాదం బదులు డబ్బులు పంచారు. సోమవారం రోజున దీపావళి పండగ సందర్భంగా భక్తులకు ప్రసాదం బదులు డబ్బులు పంచారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాళీమాత ఆలయంలో దీపావళి పండగ సందర్భంగా సోమవారం రాత్రి 11 నుంచి 2 గంటల వరకూ పూజారి శక్తి మహారాజ్ భక్తులకు డబ్బులు పంచారు. పది రూపాయల నోట్లను పెద్ద గిన్నెలో ఉంచి.. ఒక్కొక్కరికీ రెండు లేదా మూడు నోట్లు ఇచ్చారు. కాళీమాత ఆలయంలో పంపిణీ చేయబడిన డబ్బు (ప్రసాదం) పొందడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. దాంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. పండుగ రోజు భక్తులకు డబ్బులు పంచితే మంచిదని పూజారి తెలిపారు.
అమరావతి నగరంలోని ప్రధాన హిందూ శ్మశానవాటిక పక్కన సంవత్సరాల నాటి కాళీమాత ఆలయం ఉంది. ఈ ఆలయం 35-40 సంవత్సరాల క్రితం పునరుద్ధరించబడింది. 1984లో కాళీమాత ఆలయ ప్రధాన పూజారి శక్తి మహారాజ్.. దీపావళి రోజు రాత్రి బరాకత్ (ధన ప్రసాదం) పంచే పద్ధతిని ప్రారంభించారు. దీపావళి రోజు రాత్రి ఆలయానికి వచ్చే భక్తులపై కాళీమాత అనుగ్రహం ఉండేందుకు ధన ప్రసాదం పంపిణీ చేయమని శక్తి మహరాజ్ తెలిపారు.
కాళీమాత ఆలయంలో ప్రసాదం ఇవ్వడం గత 38 ఏళ్లుగా కొనసాగుతోంది. దీపావళి రోజున ఇంట్లో లక్ష్మీపూజ అనంతరం రాత్రి పది గంటల నుంచి కాళీమాత ఆలయానికి భక్తులు పోటెత్తారు. రాత్రి 11 గంటల నుంచి ఆలయంలో డబ్బు ప్రసాదం పంపిణీ చేస్తారు. రాత్రి రెండు గంటల వరకు భక్తులు కాళీమాతను దర్శించుకుని ఆశీర్వాదం పొందుతారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో సోమవారం భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read: నేను చెత్తగా ఆడాను.. నా బ్యాటింగ్ నాకే అసహ్యం వేసింది! ఆరోన్ ఫించ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read: World Dirtiest Man Dies: బలవంతంగా స్నానం చేయించారు.. ప్రపంచంలోనే అత్యంత మురికైన వ్యక్తి మృతి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook