తమిళనాడులో డీఎంకే నేత ఎంకె స్టాలిన్ అరెస్టు..!
కావేరి వివాదంతో తమిళనాడు రాష్ట్రం అట్టుడుకుతోంది. కావేరి మెనేజ్‌మెంట్ బోర్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యమైందని.. ఈ విషయంలో వెనువెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరుతూ డీఎంకే నేతలు మరికొన్ని ప్రతిపక్ష పార్టీ నేతలతో కలిసి ఈ రోజు బంద్ ప్రకటించారు.
కావేరి వివాదంతో తమిళనాడు రాష్ట్రం అట్టుడుకుతోంది. కావేరి మెనేజ్‌మెంట్ బోర్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యమైందని.. ఈ విషయంలో వెనువెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరుతూ డీఎంకే నేతలు మరికొన్ని ప్రతిపక్ష పార్టీ నేతలతో కలిసి ఈ రోజు బంద్ ప్రకటించారు. ఈ క్రమంలో ఈ రోజు చెన్నైలోని మెరీనా బీచ్ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు.
వెల్లూరులో 15 ప్రభుత్వ బస్సులపై కార్యకర్తలు రాళ్లదాడి చేయగా వారిని పోలీసులు అరెస్టు చేశారు. అన్నా సలాయ్ ప్రాంతంలో డీఎంకే పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ బంద్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్షమంది పోలీసులను మోహరించగా.. అందులో 15వేలమంది చెన్నైలోనే విధులు నిర్వహించడం గమనార్హం. కోయంబత్తూరులో రబ్బరు ఎలుకలను నోట్లో పెట్టుకుంటూ పలువురు వినూత్న రీతిలో నిరసనను తెలిపారు
ఈ బంద్ సందర్భంగా కర్ణాటక బస్సులను తమిళనాడులో బోర్డర్‌లో నిలిపివేశారు. అలాగే డెల్టా ప్రాంత రైతులను రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. ఈ బంద్ సందర్భంగా చెన్నైలో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనను పోలీస్ స్టేషనుకి తరలించారు. డీఎంకే బంద్ పిలుపుకు రైతు కమిటీలు, చిల్లర వ్యాపారుల సంఘాలు, కార్మిక సంఘాలు, న్యాయవాద సంఘాలు మద్దతు తెలిపాయి.
ఈ సందర్భంగా అన్నా సలై, కొడంబాక్కం, నంగంబాక్కం తదితర ప్రాంతాల్లో రాస్తారోకోలు నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీ తమిళనాడు పర్యటన సందర్భంగా నల్లజెండాలతో తమ నిరసన తెలుపుతామని గతంలో డిఎంకే నేత స్టాలిన్ వెల్లడించారు. ఈనెల 15న తమిళనాడుకి ప్రధాని రానున్నట్లు కూడా ఆయన తెలిపారు