Blue Aadhar Card:  ఒకవేళ మీరు అందరికీ ఒకేలాంటి ఆధార్ కార్డు ఉంటుంది అనుకుంటున్నారా? ఇండియన్ జెండా రంగుల ఆధారంగా తయారు చేసిన ఆధార్ కార్డు అందరికీ ఒకేవిధంగా ఉంటుంది అనుకోకండి. ఎందుకంటే ఈరోజు మనం ఓ కొత్త రకం ఆధార్ కార్డు గురించి చెప్పుకోబోతున్నాం ఇంతకీ మీలో ఎంతమందికి బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసు? అసలు అది ఎవరికి ఇస్తారు? మీరు ఎప్పుడైనా ఆ కార్డును నేరుగ చూశారా? విన్నారా?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్లూ ఆధార్ కార్డును బాల్ ఆధార్ కార్డు అని కూడా అంటారు. ఈ ఆధార్ కార్డును ప్రత్యేకంగా 5 ఏళ్లలోపు ఉన్న పిల్లలకు గుర్తింపుగా మన దేశంలో జారీ చేస్తారు. ఇది మన సాధారణ ఆధార్ కార్డు మాదిరి కాకుండా బ్లూ కలర్ లో ఉంటుంది. అందుకే దీన్ని బ్లూ ఆధార్ కార్డు అంటారు. సాధారణంగా ఐదేళ్లలోపు ఉన్న పిల్లల నుంచి సరైన బయోమెట్రిక్ డేటా తీసుకోవడం తేలికైన పనికాదు. అంటే ఐరిష్, ఫోటో, తీసుకోలేం.  అందుకే కేవలం ఫోటో ఉన్న బాల్ ఆధార్ కార్డును ఐదేళ్లలోపు పిల్లలకు ప్రత్యేకంగా జారీ చేస్తారు. కేవలం జనాభా ఆధారంగా, ఆ పిల్లవాడి ఫోటోతో ఈ ఆధార్ కార్డును మంజూరు చేస్తారు. దీనికి తల్లిదండ్రుల్లో ఒకరి యూఐడీ నంబర్‌ను లింక్ చేస్తారు.


ఇదీ చదవండి: Agniveer Recruitment 2024: ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2024 ప్రారంభం.. ఇలా అప్లై చేసుకోండి..


బ్లూ ఆధార్ కార్డుకు ఎలా అప్లై చేసుకోవాలి?
1. మీ ఇంటికి దగ్గర్లో ఉన్న ఆధార్ సెంటర్లకు నేరుగా వెళ్లాలి. ఆధార్ సెంటర్ లొకేషన్ https://uidai.gov.in/ అధికారిక వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటుంది.


2. ఆధార్ తీసుకునే పిల్లవాడికి సంబంధించిన సరైన పత్రాలు తీసుకెళ్లాలి. ముఖ్యంగా పిల్లల పుట్టిన సర్టిఫికేట్, ఇమ్యూనైజేషన్ కార్డు వంటివి.


3. అడ్రస్ ప్రూఫ్ కూడా ఉండాలి. దీనికి తల్లిదండ్రుల ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు లేదా రేషన్ కార్డు సరిపోతుంది.


4. పిల్లలవాడి లేటెస్ట్‌ పాస్ ఫోటో ఒకటి


5. మీ పిల్లవాడికి సంబంధించిన అన్ని వివరాలను ఆధార్ ఫారమ్ లో నమోదు చేయాలి. ఈ ఫారమ్ అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.


6. ఆధార్ నమోదు సెంటర్లో ఆపరేటర్ మీ పిల్లవాడి ఫోటో తీసుకుంటాడు. 


7. మీ ధృవపత్రాలన్ని ఆధార్ ఎన్‌రోల్మెంట్ ఆపరేటర్ కు సబ్మిట్ చేయాలి.


8. చివరగా ఆపరేటర్ ఈఐడీకి సంబంధించిన స్లిప్ మీకు అందజేస్తాడు. ఆధార్ కార్డు అప్లికేషన్ స్టేటస్ ట్రాక్ చేయడానికి EID నంబర్ తో చెక్ చేయొచ్చు.


ఇదీ చదవండి: NEET UG 2024 Registration : నీట్ రిజిస్ట్రేషన్ ప్రారంభం.. దరఖాస్తు ఫీజు, అప్లై చేసుకునే విధానం..


గుర్తుంచుకోవాల్సిన విషయాలు..
- బ్లూ ఆధార్ కార్డుకు ఎటువంటి ఫీజులు వసూలు చేయరు.
-  ఐదేళ్లలోపు ఉన్న పిల్లలకే బ్లూ ఆధార్ కార్డు వర్తిస్తుంది.
-  ఆ తర్వాత దగ్గర్లోని మీ ఆధార్ సెంటర్ కు వెళ్లి పిల్లల బయోమెట్రిక్ డేటా అందించి ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి