జాతీయ వైద్య కమిషన్ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా డాక్టర్ల సమ్మె
జాతీయ వైద్య కమిషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఇండియన్ మెడికల్ అసోషియేషన్ (ఐఎంఏ) నిరసనలకు పిలుపునిచ్చింది.
జాతీయ వైద్య కమిషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఇండియన్ మెడికల్ అసోషియేషన్ (ఐఎంఏ) నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా 2.9 లక్షల మందికి పైగా డాక్టర్లు సమ్మెలో పాల్గొన్నారు. 12 గంటలపాటు వీరు సమ్మెలో పాల్గొంటారు. ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు నిరసన తెలుపుతారు.
వైద్య వృత్తికి ప్రయోజనం: ఆరోగ్య మంత్రి
మంగళవారం రాజ్యసభలో, ప్రభుత్వం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కు బదులు మరో సంస్థను ఏర్పాటు చేయాలని ఎన్ఎంసీ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఇది వైద్య వృత్తికి లాభదాయకంగా ఉంటుందని ప్రభుత్వంనిర్ణయించింది. వారి సందేహాలను తొలగించడానికి ఐఎంఏతో చర్చలు జరుగుతున్నాయని ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా చెప్పారు. "ఇది వైద్య వృత్తికి ఉపయోగకరంగా ఉంటుంది" అని రాజ్యసభలో చెప్పారు. "మేము వారి మాటలను విన్నాము మరియు మా అభిప్రాయాలను కూడా చెప్పాం" అన్నారాయన.