గుడ్ న్యూస్.. మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు
flight services in India : లాక్‌డౌన్ కారణంగా గత రెండు నెలలుగా రద్దయిన విమాన సేవలు అతి త్వరలో అందుబాటులోకి రానున్నాయి. మే 25 నుంచి విమాన సేవలు అందుబాటోకి వస్తున్నాయి.
కరోనా వైరస్ కారణంగా గత రెండు నెలలుగా రద్దయిన విమాన సేవలు అతి త్వరలో అందుబాటులోకి రానున్నాయి. సోమవారం (మే 25) నుంచి దేశీయ విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ తెలిపారు. విమాన సంస్థల యాజమాన్యాలు విమాన సర్వీసులు అందించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దు: సుప్రీంకోర్టు
లాక్‌డౌన్ కొనసాగుతోన్న కారణంగా గత రెండు నెలలుగా దేశీయ విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు. విదేశీ విమాన సర్వీసులను అంతకు ముందే రద్దు చేయడం తెలిసిందే. కాగా, గత వారం కిందట కొన్ని ప్రత్యేక విమాన సర్వీసులను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్ నుంచి విదేశాలకు వెళ్లాలనుకునే వారికి, విదేశాలలో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా దేశానికి తీసుకొస్తున్నారు. 36-24-36తో సెగలు రేపుతోన్న అందం
కాగా, మే 12 నుంచి ప్రత్యేక రైలు సర్వీసులను పునరుద్ధరించారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారు కరోనా టెస్టులు చేపించుకుని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో దేశీయ విమాన సర్వీసులను పునరుద్దరిస్తున్నట్టు కేంద్ర మంత్రి హర్‌దీప్ పూరి ప్రకటించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్