న్యూఢిల్లీ: కరోనావైరస్ ఆందోళనల నేపథ్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కోవిడ్ -19 వ్యాప్తిని నివారించడమే ముఖ్య ఉద్దేశ్యంగా దేశవ్యాప్తంగా దేశీయ, అంతర్జాయతీయ ప్రైవేట్ విమాన కార్యకలాపాలన్నింటినీ ఏప్రిల్ 14 వరకు నిలిపివేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) పేర్కొంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతర్జాతీయ విమానాలు మార్చి 29 వరకు, అన్ని దేశీయ విమానాలను మార్చి 31 వరకు నిలిపివేస్తామని డిజిసిఎ గతంలో తెలిపిన విషయం తెలిసిందే. మరోసారి డీజీసీఏ ప్రకటన చేస్తూ అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణీకుల విమానాలన్నీ ఏప్రిల్ 14 వరకు నిలిపివేయబడతాయని పునరుద్ఘాటించింది.  


భారతదేశంలో షెడ్యూల్, నాన్-షెడ్యూల్, ప్రైవేట్ విమాన కార్యకలాపాలకు సంబంధించి దేశీయ విమానాలను ఏప్రిల్ 14న 23.59 గంటల వరకు పొడిగించినట్లు డిజిసిఎ ఒక సర్క్యులర్లో ద్వారా తెలిపింది. తిరిగి  అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణీకులకు ఏప్రిల్ 15, 12am IST నుండి సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. 


ఎయిర్ ఇండియా అన్ని దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసులు 2020 ఏప్రిల్ 14 వరకు రద్దు చేయబడ్డాయని ఎయిర్ ఇండియా ప్రతినిధి ట్వీట్ చేశారు. ఎయిర్ ఇండియా దేశీయ, అంతర్జాతీయ విమానాలన్నింటినీ ఏప్రిల్ 14 వరకు నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.


యూరప్, యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, సింగపూర్, కాబూల్, ఖాట్మండు, బహ్రెయిన్, దోహా, షార్జా, టెల్ అవీవ్, దుబాయ్, అబుదాబిలతో పాటు అమెరికాకు బయలుదేరే విమానాలు ఏప్రిల్ 14 తర్వాత ప్రారంభమవుతాయని విమానయాన వర్గాలు తెలిపాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..