అహ్మెదాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహ్మెదాబాద్ పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. తొలుత నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం అహ్మెదాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ కలిసి 22 కి.మీ మేర రోడ్ షో చేపట్టాల్సి ఉండగా.. తాజాగా ఆ రోడ్ షోను 9 కిమీ కుదించారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం  గాంధీ ఆశ్రమాన్ని కూడా సందర్శించాల్సి ఉండగా.. తాజా షెడ్యూల్‌లో గాంధీ ఆశ్రమం పర్యటనను రద్దుచేశారు. దీంతో 22 కిమీ రోడ్ షో కాస్తా.. 9 కిమీకు తగ్గినట్టయింది. అహ్మెదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్రారంభం కానున్న ఈ రోడ్ షో.. గాంధీ నగర్‌లోని కోటేశ్వర్ మీదుగా మొతెరా వరకు కొనసాగనుంది. 


9 కిమీ రోడ్ షోలో భాగంగా గాంధీ నగర్‌లో 4కిమీ మేర ప్రయాణించనున్నారు. ఈ 4 కిమీ రోడ్ షో కోసం ఏడుగు ఎస్పీ స్థాయి అధికారులు, 2000 మంది పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొనాల్సిందిగా గాంధీనగర్ ఐజి ఆదేశాలు జారీచేశారు. ఈ పర్యటనలోనే ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన మొతెరా స్టేడియంను డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించనున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..