DRDO Success : డీఆర్డీవో వరుస విజయాల సాధిస్తోంది. ఒడిశా తీరంలోని  ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి మరో క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. భారత వైమానిక దళానికి ఇక అదనపు బలం చేకూరనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్డీవో ( DRDO ) వరుసగా ప్రగతి సాధిస్తోంది. ఇండియన్ మిలట్రీ, ఎయిర్ ఫోర్స్‌కు కావల్సిన అత్యాధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా ఒడిశా తీరం ( Odisha Coast ) లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఆకాశ్ ఎన్‌జీ ( Akash NG Missile )  ( న్యూ జనరేషన్ ) క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. ఈ క్షిపణిని భారతీయ వైమానిక దళం ( Indian Airforce ) కోసం తయారు చేశారు. ఉపరితలం నుంచి గగనతలంలో శత్రుదేశాలకు చెందిన అధిక శక్తి సామర్ధ్యాలు కలిగిన వైమానిక దళాల్ని ఛేదించేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు ఉపయోగపడుతుంది. పరీక్ష సమయంలో అత్యంత కచ్చితమైన టైమింగ్ సాధించింది ఈ క్షిపణి. 


క్షిపణి పరీక్ష విజయవంతమైన తరువాత డీఆర్డీవో ( DRDO ) వివరాల్ని అందించింది. కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్, ఆన్‌బోర్డ్ ఏవియానిక్స్, క్షిపణికి చెందిన ఏరోడైనమిక్ కాన్ఫిగరేషన్ పనితీరు ట్రయల్ సమయంలో విజయవంతంగా పని చేశాయని డీఆర్డీవో ధృవీకరించింది. క్షిపణి పరీక్ష సమయంలో గగనతల విమాన మార్గాన్ని పర్యవేక్షించారు. ఈ ప్రయోగాన్ని ఎయిర్‌ఫోర్స్ ప్రతినిధుల సమక్షంలో నిర్వహించారు. క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంతో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ( Defence minister Rajnath singh ) శాస్త్రవేత్తల్ని అభినందించారు. ఇండో చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొన్నప్పటి నుంచి ఇండియా తరచూ క్షిపణి పరీక్షలు చేస్తోంది. 


Also read: New Delhi: ఎర్రకోటపై తమ జెండా ఎగురవేసిన రైతులు, ఉద్రిక్తంగా మారుతున్న Tractor Rally


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook