Droupadi Murmu Becomes President: రాష్ట్రపతిగా ఎన్నికై చరిత్ర సృష్టించిన ద్రౌపది ముర్ము
Droupadi Murmu Becomes President: భారత దేశ చరిత్రలో ద్రౌపది ముర్ము ఓ సరికొత్త అధ్యాయం లిఖించారు. భారత దేశ 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము.. దేశంలోనే రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి ఆదివాసి మహిళగా చరిత్ర సృష్టించారు. ఇన్నేళ్ల స్వరాజ్యంలో గిరిజన తెగకు చెందిన వారు రాష్ట్రపతిగా ఎన్నికవడం ఇదే తొలిసారి కావడం విశేషం.
Droupadi Murmu Becomes President Of India : భారత దేశ చరిత్రలో ద్రౌపది ముర్ము ఓ సరికొత్త అధ్యాయం లిఖించారు. భారత దేశ 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము.. దేశంలోనే రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి ఆదివాసి మహిళగా చరిత్ర సృష్టించారు. ఇన్నేళ్ల స్వరాజ్యంలో గిరిజన తెగకు చెందిన వారు రాష్ట్రపతిగా ఎన్నికవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఎన్డిఏ పక్షాల తరపునే కాకుండా ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులు సైతం క్రాస్ ఓటింగ్ ద్వారా ద్రౌపది ముర్ముకు ఓటు వేసినట్టు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. విపక్షాల తరపున బరిలో నిలిచిన రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ద్రౌపది ముర్ము ఈ విజయం సాధించారు.
ఒడిషాలోని మయుర్‌భంజ్ జిల్లాలో బైదాపోసి అనే గ్రామంలో జన్మించిన ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఒక ఉపాధ్యాయురాలి వృత్తి నుంచి ప్రస్థానం ప్రారంభించి.. ఆ తర్వాత కౌన్సిలర్‌గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, గవర్నర్‌గా సేవలు అందిస్తూ నేడు ఏకంగా దేశంలోనే అత్యున్నత పదవిగా పేరొందిన రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
Also Read : Who is Draupadi Murmu : ద్రౌపది ముర్ము ఎవరు ? రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపి ఆమెనే ఎందుకు ఎంచుకుంది ?
Also Read : Group 1 Application Editing: గ్రూప్ 1 అభ్యర్థులకు మరో గుడ్ న్యూస్.. తప్పులు సవరించుకునేందుకు మరో అవకాశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook