వీడియో: తాగిన మత్తులో ట్రాఫిక్ పోలీసును కారుతో ఈడ్చుకెళ్లిన డ్రైవర్ !
వీడియో: తాగిన మత్తులో ట్రాఫిక్ పోలీసును కారుతో ఈడ్చుకెళ్లిన డ్రైవర్ !
న్యూఢిల్లీ: తాగిన మత్తులో డ్రైవింగ్ చేయడం ఓ నేరమైతే, అందులోనూ రోడ్డుకు అడ్డంగా రాంగ్ రూట్‌లో కారును పోనిచ్చాడు ఓ డ్రైవర్. కారు రాంగ్ రూట్ లో రావడం గమనించిన ఓ ట్రాఫిక్ పోలీసు తనని ఆపబోతే... ఆ ట్రాఫిక్ పోలీసును కారుతో ఢీ కొట్టడమేకాకుండా.. ఏకంగా ఆ ట్రాఫిక్ పోలీసును తన కారుతో దాదాపు 100 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడు. అదృష్టవశాత్తుగా ఆ సమయంలో కారు బ్యానెట్ పట్టుకుని వేలాడటంతో ట్రాఫిక్ పోలీసుకు పెను ప్రమాదం తప్పింది. లేదంటే కారు అతడిపై నుంచి వెళ్లిపోయేదే. బుధవారం గురుగ్రామ్‌లోని మిలినియం సిటీ సిగ్నేచర్ టవర్ చౌరస్తాకి సమీపంలోని సెక్టార్ 29లో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రత్యక్షసాక్షులను షాక్‌కి గురిచేసింది. ఢిల్లీకి చెందిన కారు డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు.