DUSSEHRA 2020: 4 killed as boat capsizes: కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమం (Durga Idol Immersion) లో పడవ మునిగి అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ విషాద సంఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతోపాటు పలువురు గల్లంతయ్యారు. బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ జిల్లా బెల్దంగా (Beldanga) లో సోమవారం దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేస్తుండగా నీటిలో ఓ పడవ (boat capsizes) మునిగిపోయింది. దీంతో పడవలో ఉన్న పలువురు గల్లంతయ్యారు. సమచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. అనంతరం ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెలికితీశారు. Also read: Weather updates: 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మృతులను సుఖేందు దే (21), పికోన్ పాల్ (23), అరిందం బెనర్జీ (20), సోమనాథ్ బెనర్జీ (22) లుగా (4 killed ) పోలీసులు గుర్తించారు. దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేస్తుండగా ఈ ఘటన జరిగిందని.. ఇంకా గల్లంతైన పలువురి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే గజ ఈతగాళ్లతో ఈ ప్రాంతంలో రెస్క్యూ నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే పడవ మునిగినప్పుడు ఐదుగురు ఉన్నట్లు చెబుతున్నారు. ఎంతో సందడిగా సాగుతున్న దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమంలో నీటిలో పడవ బోల్తా పడి పలువురు గల్లంతవ్వడంతో ముర్షిదాబాద్ జిల్లాలోని బెల్దంగాలో తీవ్ర విషాదం అలుముకుంది.  Also Read | Covid-19 Vaccine: హైదరాబాద్ నిమ్స్‌లో కరోనా వ్యాక్సిన్ పేస్-3 ట్రయల్స్


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe