అండమాన్ లో భూకంపం; 5.6 తీవ్రతగా నమోదు
అండమాన్ దీవుల్లో 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది.
అండమాన్ దీవుల్లో భూకంపం సంభవించింది. మంగళవారం ఉదయం 8 గంటల 9 నిమిషాలకు 5.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. భూమి ఉపరితలం నుండి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం అందిందని వాతావరణ అధికారులు వెల్లడించారు.
క్రితంసారి జనవరి 14వ తేదీ అండమాన్ దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 4.8గా తీవ్రతతో నమోదైంది.