Earthquake In Delhi And Chennai: ఢిల్లీలో భూకంపం సంభవించింది. పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎన్‌సీఆర్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, హర్యానాలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ సమీపంలో భూకంప కేంద్రం గుర్తించారు. అదేవిధంగా నేపాల్‌లో కూడా భూకంపం సంభవించింది. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో భూకంపం నమోదైంది. భూకంప కేంద్రం ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌కు తూర్పున 143 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 




చెన్నైలో కూడా బుధవారం స్వల్ప భూకంపం సంభవించింది. అన్నారోడ్డు సమీపంలోని వైట్స్ రోడ్ ప్రాంతంలో ఈరోజు స్వల్పంగా భూమి కంపించగా.. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మూడంతస్తుల భవనంలో ప్రకంపనలు రావడంతో ఉద్యోగులు.. ప్రజలు భయంతో బయటకు వచ్చి రోడ్డుపైకి వచ్చారు. ఈరోజు ఉదయం 10.15 గంటలకు అకస్మాత్తుగా భూకంపం సంభవించింది. భూకంపంపై నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ అధికారి వివరణ ఇచ్చారు. భూకంపం స్వల్పంగానే ఉందని, ఎలాంటి నష్టం జరగలేన్నారు. ఎవరూ ఆందోళనకు గురికావద్దని సూచించారు. 


చెన్నై మెట్రో రైలు పనుల వల్ల ఎలాంటి భూకంపం సంభవించిందని ప్రచారం జరగ్గా.. అధికార యంత్రాంగం క్లారిటీ ఇచ్చింది. చెన్నైలోని రాయపేటలోని లాయిడ్స్ రోడ్డు సమీపంలో భూకంపం సంభవించింది. అక్కడి ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులు అపార్ట్ మెంట్ భవనం నుంచి బయటకు పరుగులు తీయగా.. కాసేపు తోపులాట జరిగింది. 


ఇటీవల భారీ భూకంపాలతో టర్కీ, సిరియా దేశాలు అతలాకుతలమవ్వగా.. భారత్‌లోనూ భూకపం ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉందని పరిశోధకులు అంచనా వేశారు. త్వరలోనే భూకంపం వచ్చే ప్రమాదం ఉందని జియోఫిజికల్‌ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ) చీఫ్ సైంటిస్ట్ డా.పూర్ణచందర్ రావు చెప్పిన మరుసటి రోజే ఢిల్లీ, చెన్నై నగరాల్లో భూమి కంపించడం ఆందోళనకు గురిచేస్తోంది. భూమి పొరల్లో ఉండే ప్లేట్లు నిరంతరం కదులుతాయని ఆయన చెప్పారు. మన దేశంలో భూభాగం కింద ఉన్న ప్లేట్లు సంవత్సరానికి 5 సెంటీమీటర్లు వేగంతో కదులుతున్నాయని.. ప్లేట్ల కారణంగా హిమాలయాలపై ఒత్తిడి పెరిగి.. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందన్నారు. 


Also Read: Aadhaar Card Update: ఆధార్‌లో కీలక మార్పులు.. ఎన్నిసార్లు అప్‌డేట్ చేసుకోవచ్చో తెలుసా..?  


Also Read: Deepak Chahar: సీఎస్‌కే ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఐపీఎల్‌కు దీపక్ చాహర్ రెడీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి