Earthquake hits Delhi, NCR: తజకిస్తాన్‌లో శుక్రవారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై 6.3 గా నమోదైన ఈ భూకంపం తాకిడికి మన దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఢిల్లీ శివార్లను ఆనుకుని ఉన్న Noida, Gurgaon, ఫరీదాబాద్, ఘాజియాబాద్‌ ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి భూకంపం సంభవించింది. అలాగే పంజాబ్‌, జమ్మూకాశ్మీర్, ఉత్తర్ ప్రదేశ్, Uttarakhand వంటి రాష్ట్రాల్లోనూ భూమి స్వల్పంగా కంపించింది. అప్పుడప్పుడే నిద్రలోకి జారుకుంటున్న జనం Earthquake ధాటికి ఒక్కసారిగా శబ్ధం రావడంతో వెంటనే నిద్రలేచి ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. నిద్రలోకి జారుకున్న వారు కూడా లేచి వారి వెంటే బయటకు పరుగులు తీశారు. 


ఇటీవల కాలంలో ఢిల్లీలో భూకంపం సర్వసాధారణమైంది. రోజుల వ్యవధిలోనే పలుమార్లు భూమి కంపించిన సందర్భాలు ఉన్నాయి. సరిగ్గా నాలుగు రోజుల క్రితమే పంజాబ్‌లోని బటిండాతో పాటు జమ్మూకశ్మీర్‌లో Earthquake చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.