DK Shiva kumar: ఓటుకు నీళ్లు ఆఫర్.. డీకే శివకుమార్ పై కేసు నమోదు చేసిన పోలీసులు..
DK Shiva Kumar: బెంగళూరు వాసులు గత రెండు నెలలుగా తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. బెంగళూరు నగరానికి ప్రధానంగా కావేరి నది, భూగర్భ జలాలు అనే రెండు వనరుల నుంచి నీటి సరఫరాను పొందుతుంది. ఈ క్రమంలో భూగర్భజనాలు క్రమంగా అడుగంటడతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు.
Election Commission Serious On Karnataka Congress Leader DK Shivakumar: దేశంలో నాలుగు రాష్ట్రాలు, లోక్ సభస్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే,సాధారణంగా ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చేస్తుంది. ఎన్నికల సంఘం నియామవళిని అనుసరించి అందరు వ్యవహారించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో దేశంలో ఎన్నిలక సంఘం మాత్రమే క్రియాశీలంగా పనిచేస్తుంది. రాజకీయ నాయకులు ఓటర్లకు ప్రలోభపెట్డడం, బహుమతులు ఇవ్వడంవంటివి ఎన్నికల నియామవళికి పూర్తిగా విరుధ్దం. కొంత మంది నాయకులు తరచుగా ఎన్నికల నియామవళిని ఉల్లంఘించి మాట్లాడుతుంటారు. వీరిపై ఎన్నికల సంఘం తగిన విధంగా చర్యలు కూడా తీసుకుంటుంది. తాజాగా, కర్ణాటక డిప్యూటీ సీఎం కూడా ఎన్నికల ప్రచారంలో వివాదస్పద వ్యాఖ్యలుచేశారు. ప్రజలకు ప్రలోభ పెట్టే వ్యాఖ్యలు చేశారు. దీంతో డీకేపై ఈసీ సీరియస్ అయ్యింది.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మోడల్ కోడ్ ఉల్లంఘించినందుకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై పోలీసు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్.. తన సోదరుడు డికె సురేష్‌కు ఓటు వేస్తే కావేరి నది నుండి నీటిని సరఫరా చేస్తానని బెంగళూరు ఓటర్లకు చెప్పినట్లు ఆరోపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై ఈసీ సీరియస్ అయ్యింది. వెంటనే పోలీసులకు కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా.. బెంగళూరు రూరల్ నుంచి డీకే సురేష్ పోటీ చేస్తున్నారు.డీకే శివకుమార్ తన ప్రసంగంలో మోడల్ కోడ్‌ను ఉల్లంఘించారని, ఎన్నికలలో ప్రలోభపెట్టడం వంటి వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని పోలీసు కేసు నమోదు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలిపారు.
సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియో క్లిప్‌లో, డీకె శివకుమార్ తన సోదరుడి నియోజకవర్గంలోని హౌసింగ్ సొసైటీ నివాసితులతను కలిశారు. తన సోదరుడికి ఓటు వేస్తే కావేరీ నదీజలాలను సరఫరా చేస్తామని చెప్పారు. "మీరు మీ నమ్మకాన్ని నాతో పంచుకోవాలి, కాబట్టి నేను మిమ్మల్ని చూసుకుంటాను. మీరు బూత్ ద్వారా ఓటు వేయాలని కోరారు. తాను DCM, BDA, బెంగళూరు, నీటి మంత్రిని - నేను ఇక్కడ ఉన్నాను, ప్రతిదీ మీ ఓటులో ఉంది. నేను మీ ఇంటికి వచ్చాను, నన్ను ఉపయోగించుకోండి, నాకు ఓటు వేయండి, నేను మీ కోరికలు నెరవేరుస్తానంటూ వ్యాఖ్యలు చేశారు.
Read More: Venomous Snakes Facts: పాముల గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా..?
బెంగళూరుకు రోజూ 2,600-2,800 మిలియన్ లీటర్ల నీరు అవసరమని తెలుస్తోంది. ప్రస్తుత సరఫరా అవుతోంది మాత్రం దానిలో సగం. ఫలితంగా నగరవాసులకు రోజు నరకం అనుభవిస్తున్నారు. ఏప్రిల్ 26, మే 7న రెండు దశల్లో కర్ణాటక లోక్‌సభ ఎన్నికలు జరుగనుండగా, జూన్ 4న అన్ని స్థానాలకు ఫలితాలు వెలువడనున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter