Jobs in ECIL: బీటెక్ పాసయ్యారా ? ఈ జాబ్ నోటిఫికేషన్ చూడండి
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( ECIL )లో 350 టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈసిఐఎల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ( ECE), ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ( EEE) విభాగాల్లో బీటెక్, బీఈ ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
హైదరాబాద్: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( ECIL )లో 350 టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈసిఐఎల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ( ECE), ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ( EEE) విభాగాల్లో బీటెక్, బీఈ ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈసిఐఎల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం https://careers.ecil.co.in/ వెబ్‌సైట్‌లోకి లాగాన్ అవండి.
No. of Posts details పోస్టుల వివరాలు :
మొత్తం టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు- 350
ఈసీఐఎల్ హైదరాబాద్- 200
ఈసీఐఎల్ బెంగళూరు- 50
ఈసీఐఎల్ న్యూఢిల్లీ- 40
ఈసీఐఎల్ ముంబై- 40
ఈసీఐఎల్ కోల్‌కతా- 20
Important dates ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ- 2020 ఆగస్ట్ 19
దరఖాస్తు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 30 మధ్యాహ్నం 2 గంటలు
Eligibility అర్హతలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ( ECE ) / ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ( EEE ) / ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ( EIE ) / మెకానికల్ ఇంజనీరింగ్ ( ME) / కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ( CSE ) / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ( IT ) 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
Experience అనుభవం: కంప్యూటర్ హార్డ్‌వేర్, లైనక్స్, విండోస్ ఓఎస్, నెట్‌వర్కింగ్‌లో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
హైదరాబాద్‌లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వించే అడ్రస్:
Electronics Corporation Of India Limited, Nalanda Complex, CLDC, TIFR Road, Hyderabad- 500062.
ఈ రిక్రూట్‌మెంట్‌కి మీరు అర్హులా ? మరి ఇంకెందుకు ఆలస్యం ? వెంటనే దరఖాస్తు చేసుకోండి.