ECIL Recruitment 2022: ఈసీఐఎల్‌లో జాబ్స్... డిగ్రీ విద్యార్హతతో నెలకు రూ.25 వేతనం...
ECIL Recruitment 2022: మీరు ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లోమా లేదా ఐటీఐ పూర్తి చేశారా.. ఆ విద్యార్హతతో ఈసీఐఎల్‌లో ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది.
ECIL Recruitment 2022: ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, సీనియర్ అర్టిసన్, జూనియర్ అర్టిసన్ పోస్టులు ఉన్నాయి. కాంట్రాక్ట్ పద్దతిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం ఈ నెల 12వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. పూర్తి వివరాలు కింద తెలుసుకోండి...
మొత్తం ఖాళీలు : 19
టెక్నికల్ ఆఫీసర్ - 14
సైంటిఫిక్ అసిస్టెంట్ - 4
సీనియర్ అర్టిసన్ - 1
జూనియర్ అర్టిసన్ - 1
విద్యార్హతలు :
ఆయా పోస్టులను బట్టి ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లోమా లేదా ఐటీఐ ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయో పరిమితి :
అభ్యర్థుల గరిష్ఠ వయసు 30 ఏళ్లకు మించరాదు. ఓబీసీలకు 3 ఏళ్లు, వికలాంగులకు 10 ఏళ్ల మినహాయింపు ఉంటుంది.
వేతన వివరాలు :
టెక్నికల్ ఆఫీసర్ : నెలకు రూ.25,000
సైంటిఫిక్ అసిస్టెంట్ : నెలకు రూ. 20,670
సీనియర్ అర్టిసన్ : నెలకు రూ.18,974
జూనియర్ అర్టిసన్ : నెలకు రూ.18,824
అభ్యర్థుల ఎంపిక విధానం :
మొదట అభ్యర్థులు www.ecil.co.in వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ ఫామ్‌ను నింపి.. దానితో పాటు రెజ్యుమెతో ఇంటర్వ్యూకి హాజరవ్వాలి. ఏప్రిల్ 12వ తేదీన ఇంటర్వ్యూలు జరుగుతాయి.
ఇంటర్వ్యూ వేదిక :
# 1207, వీర్ సావర్కర్ మార్గ్, దాదర్ (ప్రభాదేవి),
ముంబై - 400 028.
నెం. 1/1, 2వ అంతస్తు, LIC బిల్డింగ్, సంపిగే రోడ్,
మల్లేశ్వరం, బెంగళూరు - 560 003.
పానగల్ బిల్డింగ్, గ్రౌండ్ ఫ్లోర్, IA, జీనిస్ రోడ్,
సైదాపేట్, చెన్నై - 600 015
D-15, DDA లోకల్ షాపింగ్ కాంప్లెక్స్,
ఎ-బ్లాక్, రింగ్ రోడ్, నరైనా, న్యూఢిల్లీ - 110028.
అపీజయ్ హౌస్, 4వ అంతస్తు,
15-పార్క్ స్ట్రీట్, కోల్‌కతా - 700016.
ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలకు https://www.ecil.co.in/jobs.html
https://www.ecil.co.in/jobs/ADVT_12_2022.pdf ఈ వెబ్‌సైట్స్‌ను సందర్శించండి.
Also Read: Alia Ranbir Marriage: పెళ్లికి సిద్ధమైన ఆలియా, రణ్ బీర్ కపూర్.. వేడుక జరిగేది అక్కడే!
Also Read: IPL 2022 Points Table: ఐదో స్థానంలో లక్నో.. అట్టడుగు స్థానంలో హైదరాబాద్! ఆరెంజ్ క్యాప్ రేసులో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook