Edible oil prices after duty cut: న్యూ ఢిల్లీ : కేంద్రం నుంచి గుడ్ న్యూస్ వెలువడింది. దేశవ్యాప్తంగా వంట నూనెల ధరలు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పామాయిల్‌పై రూ.20, వేరుశెనగ నూనెపై రూ.18 తగ్గింది. సోయాబీన్‌పై రూ.10, పొద్దుతిరుగుడు నూనెపై రూ.7 తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం ఓ అధికారిక ప్రకటన జారీ చేసింది. లీటర్‌ వంట నూనెకు కనిష్టంగా రూ. 7 నుంచి గరిష్టంగా రూ.20 వరకు ధరలు తగ్గినట్లు (Edible oil prices reduced) కేంద్రం తమ ప్రకటనలో స్పష్టం చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీపావళి సందర్భంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన కేంద్రం తాజాగా వంట నూనేల ధరలు తగ్గించడం దేశ ప్రజలకు భారీ ఊరటనిచ్చింది. కేంద్రం ఎలాగైతే పెట్రోల్, డీజిల్ ధరలపై (Petrol, diesel prices) సుంకం తగ్గించుకుందో అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తాము విధించే వ్యాట్‌పై కొంత మొత్తాన్ని తగ్గించుకుంటే ప్రజలకు ఇంకొంత ఊరట లభిస్తుందని వాహనదారులు చెబుతున్నారు. 


ఇప్పటికే ఈ విషయంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిర్ణయం తీసుకోవడంతో ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు (Fuel prices in AP and TS) ఇంకొంత మేరకు దిగొచ్చినట్టు వార్తలు వెలువడుతున్నాయి. అయితే, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం.