Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh)లో దారుణం చోటుచేసుకుంది. లఖీమ్‌పూర్‌ ఖేరీ జిల్లాలో రైతుల ఆందోళన(agitation) హింసాత్మకంగా మారింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులపై కేంద్రమంత్రి కాన్వాయ్‌ దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు(Farmers) సహా ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లకింపూర్‌ ఖేరీ జిల్లా(Lakhimpur Kheri district) టికునియాలో ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా, డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య (UP deputy chief minister Keshav Prasad Maurya)ఆదివారం హాజరయ్యారు. వీరి పర్యటనను నిరసిస్తూ ఉదయం నుంచి రైతులు నల్ల జెండాలు చూపిస్తూ ఆందోళన చేస్తున్నారు. 


Also Read: అక్కడ కిలో ఉప్పు రూ.130, కిలో చక్కెర రూ.150..కారణం ఏంటంటే..


ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. అదే సమయంలో కేంద్రమంత్రి, డిప్యూటీ సీఎం ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ రోడ్డు పక్కనే ఆందోళన చేస్తున్న రైతులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు, మరో  నలుగురు మరణించారు. కారుతో రైతులను ఢీకొట్టిన ఘటనలో కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్‌ మిశ్రా పేరు వినిపిస్తోంది. ఈ ఘటన అనంతరం ఆ ప్రాంతం ఉద్రిక్తతంగా మారింది. ఆగ్రహంతో మూడు వాహనాలను రైతులు తగలబెట్టారు. రైతులపై కాన్వాయ్‌ దూసుకెళ్లడాన్ని సంయుక్త కిసాన్‌ మోర్చా నేత రాకేశ్‌ టికాయిత్‌(Bhartiya Kisan Union (BKU) leader Rakesh Tikait) ఖండించారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి