ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సర్వేలు కోడై కూస్తున్నాయి. ఒక్కో రోజు ఒక్కో మీడియా సంస్థ ఇదిగో సర్వే అంటూ తమకు ఇష్టమొచ్చినట్లుగా ఫలితాలను ప్రకటిస్తోంది. ఇక ఇది చెల్లదు... దీనికి సంబంధించి ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది . దీనికి గురించి తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ పై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఈ నెల 12 నుంచి డిసెంబర్ 7 సాయంత్రం 5.30 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది.  ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఓటర్లపై ప్రభావం చూపే అవకాశమున్న నేపథ్యంలో ఈసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 


ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లో తొలి దశ పోలింగ్ ఈ నెల 12వ తేదీన జరగనుంది. ఇక మిగిలిన  రాష్ట్రాలకు దశల వారీగా ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్, తెలంగాణ శాసనసభలకు డిసెంబర్  7వ తేదీన జరిగే ఎన్నికలతో ఐదు రాష్ట్రాల పోలింగ్ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ ఈ మేరకు నిషేధం విధించింది.