Assembly Elections: దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఎన్నికల కమీషన్ ఆ రాజకీయ పార్టీలకు ఊరటనిచ్చింది. మరో మూడు రోజుల్లో ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా థర్డ్‌వేవ్ నేపధ్యంలో దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో వివిధ దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 10 నుంచి మార్చ్ 7 వరకూ ఏడు దశల్లో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చ్ 3, మార్చ్ 7వ తేదీల్లో అంటే మొత్తం 7 విడతల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఇక పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు  ఫిబ్రవరి 20వ తేదీన జరుగుతాయి. ఉత్తరాఖండ్, గోవాల్లో ఫిబ్రవరి 14వ తేదీన ఒకే దశలో ఎన్నికలున్నాయి. ఇక మణిపూర్ లో ఫిబ్రవరి 27, మార్చ్ 3 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మార్చ్ 10 వ తేదీన ఉండనుంది.


కరోనా సంక్రమణ నేపధ్యంలో నిన్నటి వరకూ ఊరేగింపులు, రోడ్ షోలు, సమావేశాలకు అనుమతి లేదు. ఇప్పుడు కేసులు తగ్గుముఖం పట్టడంతో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) కీలక నిర్ణయం తీసుకుంది తిరిగి బహిరంగ సభలకు అనుమతి మంజూరు చేసింది. అయితే రోడ్ షో, పాదయాత్ర, ఊరేగింపులపై నిషేధం మాత్రం ఇంకా కొనసాగనుంది. ఇండోర్ లేదా అవుట్‌డోర్ సమావేశాలు జరుపుకున్నా..తక్కువమందికి అనుమతించాలని తెలిపింది. వివిధ జిల్లాల ఎన్నికల పరిశీలకుల అనుమతితో ఈ సమావేశాలు నిర్వహించుకోవల్సి ఉంటుంది. అదే సమయంలో కోవిడ్ ఆంక్షలు తప్పనిసరిగా అమలు చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇండోర్ సమావేశాలకు 50 శాతం, అవుట్ డోర్ సమావేశాలకు 30 శాతం సీటింగ్ ఉండాలని పేర్కొంది. ఇక ఇంటింటి ప్రచారంలో 20 మందికి మించి ఉండకూడదు. ఉదయం 8 గంటల్నించి రాత్రి 8 గంటల వరకు మాత్రమే ప్రచారానికి వీలుంటుంది. 


Also read: Central employees: సోమవారం నుంచి కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల్లో 100 శాతం ఉద్యోగులు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook