Arun Goel: లోక్‌సభ ఎన్నికల ముందు అనూహ్య ట్విస్ట్.. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా
Arun Goel Resignation: లోక్‌సభ ఎన్నికల ముందు అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ అరుణ్ గోయల్ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. రాజీనామాకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Arun Goel: పార్లమెంట్ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న సమయంలో అనూహ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ అరుణ్ గోయల్ హఠాత్తుగా రాజీనామా చేశారు. ఇంకా మూడేళ్ల పదవీ కాలం ఉన్న సమయంలో ఆయన రాజీనామా చేయడం కలకలం రేపింది. ఆయన చేసిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగమేఘాల మీద ఆమోదం చేశారు.
అయితే ఆయన ఆకస్మికంగా రాజీనామా చేయడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 1985 పంజాబ్ కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికార గోయల్ 2022 నవంబర్‌లో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నియమితులయ్యారు. ఫిబ్రవరిలో అనూప్ పాండే పదవీ విరమణ పొందగా.. గోయల్ రాజీనామాతో ముగ్గురు సభ్యుల కేంద్ర ఎన్నికల సంఘం ప్యానెల్‌లో ఇప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు.
Also Read: X TV App: ఎలన్ మస్క్ మరో సంచలనం.. యూట్యూబ్‌కు పోటీగా టీవీల్లోనూ 'ఎక్స్' ట్విట్టర్
మొదటి నుంచి వివాదం
ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్ నియామకమే వివాదంగా మారింఇ. 18 నవంబర్ 2022న అరుణ్ గోయల్ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. అయితే తర్వాతి రోజే ఎన్నికల సంఘం కమిషనర్‌గా ఆయన్ను నియమించారు. ఆగమేఘాల మీద అతడి నియామకంపై తీవ్ర వివాదం ఏర్పడింది. అరుణ్ గోయల్ నియామకంపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 24 గంటలు కూడా గడవకముందే మొత్తం నియామక ప్రక్రియ ఎలా పూర్తి చేశారని రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది.
Also Read: Mizoram Speaker: యాంకర్ నుంచి స్పీకర్‌గా.. మిజోరాంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి