COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Election Results 2023: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం మూడు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం అధిక్యంలో ఉంది. ఒక రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్‌ హవా కొనసాగుతోంది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకతోనే వెనకంజలో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రాబోతున్నట్లు సమాచారం. ఉదయం 10:30 గంటల వరకు తాజా ట్రెండ్స్‌ ప్రకారం తెలంగాణలోని మొత్తం 119 స్థానాలకు గాను కాంగ్రెస్ 66 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా..భారత రాష్ట్ర సమితి కేవలం 39 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. 


మధ్యప్రదేశ్‌లోని మొత్తం 230 స్థానాలకు గాను 195 స్థానాల్లో తాజా ట్రెండ్స్ ప్రకారం..బీజేపీ 155 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా..కాంగ్రెస్ 72 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక రాజస్థాన్‌ విషయానికొస్తే తాజా ట్రెండ్స్‌ ప్రకారం..అధికార కాంగ్రెస్‌ను బీజేపీ ఓడించిన పని చేసింది. ప్రస్తుతం 199 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తాజా ట్రెండ్ ప్రకారం బీజేపీ 107 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా..కాంగ్రెస్ 78 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో అధికార కాంగ్రెస్ కూడా ఓటమి దిశగా పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. మొత్తం 90 స్థానాల్లో బీజేపీ 49 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 38 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అతి త్వరలోనే పూర్తి ఫలితాలు రాబోతున్నట్లు తెలుస్తోంది. 


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్


అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్‌లోని 230 స్థానాలకు, ఛత్తీస్‌గఢ్‌లోని 90, తెలంగాణలోని 119, రాజస్థాన్‌లోని 199 స్థానాలకు సంబంధించిన లెక్కింపు ప్రక్రియ  8 గంటల నుంచి కొనసాగుతుంది. అయితే రాజస్థాన్‌లోని ఓ నియోజకవర్గంలో అభ్యర్థి మరణించడంతో ఎన్నిక వాయిదా పడ్డాయి. 


గుజరాత్‌ విజయలోని బీజేపీ దృష్టిలో పెట్టుకుని మధ్యప్రదేశ్‌లో పునరావృతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. 1998 నుంచి గుజరాత్‌ను బీజేపీ పాలిస్తోంది. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్‌లో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వెలబడుతున్న ఫలితాలను చూస్తే రాజస్థాన్‌తో పాటు ఛత్తీస్‌గఢ్‌లలో కూడా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా గెలుపు ఓటముల గురించి చివరి నిమిషం వరకు వేచి చూడాల్సిందే. 


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి