వారణాసిపైనే అందరి దృష్టి ; ప్రధాని మోడీపై ప్రియాంక పోటీ ?
నరేంద్ర మోడీపై ప్రియాంక గాంధీ బరిలోకి దిగితే ఎలాగుంటది..... బ్లాక్‌బస్టర్ మూవీ చూసింత ఫీలింగ్ కల్గుతుది కదూ.. నిజంగా ఇదే జరిగితే ఈ ఎన్నికల్లో తప్పకుండా ఇదే హాట్ టాపిక్ . ఇది సాధ్యమా అంటే తాజాగా ప్రియాంక చేసిన వ్యాఖ్యలను బట్టి ఔననే సంకేతాలు అందుతున్నాయి..
రెండోస్సారీ మోడీ...
వారణాసిలో రెండో సారి ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్న ప్రధాని నరేంద్ర మోడీపై బ్రహ్మాస్త్రాన్ని సంధించాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. ఈ క్రమంలో మోడీపై ప్రియాంక గాంధీ అయితే గట్టి పోటీ ఇస్తారని భావించిన పార్టీ హైకమాండ్.. ఆమెనే బరిలో దించుతున్నట్లు టాక్ ... ఇదే అంశం గత కొన్ని రోజులుగా రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇవన్ని ఊహాగానాలేనని అనుకుంటున్న సందర్భంలో గురువారం సాయంత్రం ప్రియాంక చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు బరింత బలాన్ని ఇస్తున్నాయి.
ప్రియాంక ఏమన్నాంటే....
సోనియాగాంధీ బరిలో ఉన్న రాయ్‌బరేలీలో ఆమె తరఫున ప్రియాంక ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఉన్న సమయంలో కొందరు కార్యకర్తలు ప్రియాంకను ‘మీరే ఇక్కడ పోటీచేయాల్సింది..’ అని కోరారు. దానికి ఆమె వెంటనే ‘ ఏం.. వారాణసీ నుంచి వద్దా..?’ అని ఎదురు ప్రశ్నించారు. దానికి వారు ఎక్కడైనా సరే... అని అనడంతో ఆమె మళ్లీ కల్పించుకుని.. ‘చెప్పండి... వారాణసీ నుంచి పోటీచేయనా ? వద్దా’ అని మళ్లీ మళ్లీ నవ్వుతూ అడిగారు.
కాంగ్రెస్ లో ఉత్సాహం...
అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ....ప్రియాంక వ్యాఖ్యలతో ప్రధాని మోడీపై ఆమె బరిలోకి దిగుతున్నట్లు కార్యకర్తలు కన్ఫామ్ చేసుకున్నారు. వారణాసి నుంచి బరిలోకి రెండో సారి బరిలోకి దిగుతున్న నరేంద్ర మోదీ పై ప్రియాంక పోటీ అన్నది ఓ హాట్ టాపిక్‌లా మారింది. మోదీపై బ్రహ్మాస్త్రమేనంటూ కాంగ్రెస్ వర్గాలు ఉత్సాహం ప్రదర్శిస్తున్నాయి..
స్వాగతిస్తున్న కమలదళం...
మరోవైపు ప్రియాంక వ్యాఖ్యలను బీజేపీ శ్రేణులు స్పందించారు. వారణాసికి చెందిన స్థానిక బీజేపీ నేతలు ప్రియాంక పోటీకి ఆహ్వానించారు. ‘రండి.. తొలి పోటీలోనే ఓడిన నేతగా రికార్డు సృష్టించవచ్చు’ అని సైటర్లు సంధిస్తున్నారు
హోరా హోరీ పోరు...
ఐదు విడతల్లో జరగనున్న ఈ స్వార్వత్రిక ఎన్నికల్లో చివరిదశలో మే 16న వారణాసిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే వారణాసి నుంచి ప్రధాని మోడీ మళ్లీ బరిలోకి దిగనున్నట్లు బీజేపీ ప్రకటించింది. ఇప్పుడు ఈ స్థానంలో పోటీ చేసే అభ్యర్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రియాంక ను గనుక బరిలోకి దించితే వారణాసిలో హోరా హోరీ పోటీ తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.