Electic Vehicle Charging Infrastructure Guidelines: దేశంలో విద్యుత్ వాహన రంగానికి (Electric Vehicles in India) బూస్టింగ్ ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ వాహనాల వినియోగాన్ని పోత్సహించేందుకు 'ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్' గైడ్‌లైన్స్‌ను సవరించింది. కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం... ఎలక్ట్రిక్ వాహనాల యజమానులు తమ ఇల్లు లేదా ఆఫీస్‌లో ఇప్పటికే ఉన్న విద్యుత్ కనెక్షన్ సదుపాయాన్ని ఉపయోగించుకుని వాహనాలను ఛార్జింగ్ చేసుకోవచ్చు. తద్వారా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌కు వెళ్లే అవసరం లేకుండా ఇంటి వద్దే వాహనాన్ని ఛార్జింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించినట్లయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజా గైడ్ లైన్స్‌లో పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల (Public Charging Stations) ఏర్పాటుకు లైసెన్స్ అవసరం లేదని  కేంద్రం స్పష్టం చేసింది. ఇకపై వ్యక్తులు లేదా ఏదేని సంస్థ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసుకునేందుకు ఎటువంటి లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నిర్దేశించిన ప్రోటోకాల్‌కు అనుగుణంగా ఆ ఛార్జింగ్ స్టేషన్లు ఉండాలి. టెక్నాలజీ, భద్రత, పెర్ఫామెన్స్ స్టాండర్డ్ అంశాల్లో కేంద్రం నిర్దేశించిన ప్రమాణాలను పాటించాలి.


పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు భూ కేటాయింపులు :


ప్రభుత్వ లేదా ప్రభుత్వ రంగ సంస్థల ఆధీనంలో ఉన్న భూమిని పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల (Public Charging Stations) ఏర్పాటుకు ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థలకు ప్రభుత్వం కేటాయించవచ్చు. ఇందుకోసం యూనిట్‌కు రూ.1 ధరతో బిడ్డింగ్‌ను ప్రారంభించవచ్చు. పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు  పీఎస్‌యూలకు రాయితీ కల్పించవచ్చు. పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో ధరలు మార్చి 2025 వరకు సగటు ధరను మించకూడదు. ప్రైవేట్ ఏజెన్సీలకు ప్రభుత్వ భూమిని కేటాయించే పక్షంలో రెవెన్యూ షేరింగ్ మోడల్‌ను కూడా అనుసరించవచ్చు. ఇందుకోసం సదరు సంస్థ, ప్రభుత్వం మొదట పదేళ్ల కాలానికి ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది.


తాజా నిర్ణయాలు, సవరణలతో చాలామంది విద్యుత్ వాహనాల వైపు మళ్లుతారని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో ఇప్పటికే విద్యుత్ వాహనాల (Electric Vehicles) వినియోగం గణనీయంగా పెరిగింది. భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ వనరులు అడుగంటే అవకాశం ఉండటంతో విద్యుత్ వాహన రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. విద్యుత్ వాహనాలతో వాయు కాలుష్యానికి కూడా చెక్ పెట్టినట్లవుతుంది.


Also Read: UP Polls 2022: ఎన్నికల వేళ ఎస్పీకి బిగ్ షాక్.. బీజేపీలో చేరనున్న ములాయం కోడలు


Also Read: నా బికినీ ఫోటోలు చూసి ఓటు వేయొద్దు.. నేను ఎందుకు రాజకీయాలలోకి వచ్చానంటే: ఎమ్మెల్యే అభ్యర్థి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook