Controversial Ad: షాపింగ్ చేసి కరోనా తెచ్చుకుంటే రూ.50 వేల క్యాష్ బ్యాక్.. సంచలనం
కరోనా ఎక్కడ తమకు సోకుతుందేమోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఎంత తిరిగినా సరే కరోనా రాకుండా చూడాలని దేవుణ్ని ప్రార్థిస్తుంటారు. షాపింగ్ చేసి కరోనా తెచ్చుకుంటే రూ.50వేల క్యాష్ బ్యాక్ అంటూ ఓ ప్రకటన (Controversial Ad in Kerala) సంచలనం రేపింది.
జనాలు కరోనా ఎక్కడ తమకు సోకుతుందేమోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. కొందరైతే తాము బయట ఎంత తిరిగినా సరే కరోనా రాకుండా చూడాలని దేవుణ్ని ప్రార్థిస్తుంటారు. తమ వద్ద షాపింగ్ చేసి కరోనా తెచ్చుకుంటే రూ.50వేల క్యాష్ బ్యాక్ (Electronic Shop Controversial Ad in Kerala) అంటూ ఓ ప్రకటన సంచలనం రేపింది. ఏకంగా న్యూస్ పేపర్లలో ప్రకటన వచ్చేసరికి ఓ వైపు జనాలు ఆశ్చర్యపోగా, మరోవైపు ఇలాంటి ప్రకటన చేసినందుకు ఆ షాపు యజమానిపై అధికారులు చర్యలు తీసుంటున్నారు. Telangana: మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా
కేరళలో ఈ ఘటన చోటుచేసుకుంది. పబ్లిసిటీ స్టంట్ కోసం ఎలక్ట్రానిక్ షాపు వాళ్లు మంగళవారం ఈ యాడ్ ఇచ్చారు. తమ వద్ద ఎలక్ట్రానిక్ ఐటమ్స్ షాపింగ్ చేసి కరోనా బారిన పడితే వారికి కేవలం 24 గంటల్లోనే రూ.50 వేల క్యాష్ బ్యాక్, జీఎస్టీ లేకుండానే అందిస్తామని ప్రకటన (Controversial Ad in Kerala)లో పేర్కొన్నారు. ఆగస్టు 15 నుంచి 30వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. Badam Benefits: ఉదయాన్నే బాదం తింటున్నారా.. ఈ ప్రయోజనాలు తెలుసా!
అది చూసిన జనాలు షాపింగ్ చేసేందుకు ఆ ఎలక్ట్రానిక్ షాపు ముందు క్యూ కట్టారు. విషయం వైరల్ కావడంతో పోలీసులు, అధికారులు షాపు వద్దకు చేరుకుని చర్యలు చేపట్టారు. కరోనా సోకినవారు సైతం షాపింగ్‌కు వచ్చి మీ దగ్గర షాపింగ్ చేసినందుకే కరోనా సోకిందని వాదించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కరోనాను వ్యాప్తి చేసే ప్రకటన చేసిన షాపు నిర్వాహకులను విచారిస్తున్నారు. కాగా, ఇప్పటివరకూ కేరళలో 50వేల వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. Jiya Roy Hot Stills: బెంగాల్ బ్యూటీ జియా రాయ్ ట్రెండింగ్ ఫొటోలు
మోడల్, నటి Gunnjan Aras Hot Pics వైరల్