Elephants Mob: ఆంధ్రప్రదేశ్‌లో రెండు వారాల కిందట ఏనుగుల గుంపుల దాడిలో రైతు మరణించిన సంఘటన మరువకముందే ఏపీలో మళ్లీ ఏనుగులు విజృంభించాయి. ఈసారి ఏపీతోపాటు తెలంగాణలోనూ ఏనుగులు హల్‌చల్‌ చేశాయి. గుంపులు గుంపులుగా వచ్చిన ఏనుగులు పంట పొలాలపై విరుచుకుపడ్డాయి. దీంతో రైతులు భయాందోళన చెందారు. అంతేకాకుండా స్థానిక ప్రజలు కూడా బిక్కుబిక్కుమంటూ వణికిపోయారు. స్థానిక అధికార యంత్రాంగంతో కలిసి అటవీ శాఖ అధికారులు అతి కష్టం మీద ఏనుగులను అడవుల్లోకి తిరిగి పంపారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Konda Surekha Vs KTR: కేటీఆర్ పరువు నష్టం కేసులో కొండా సురేఖపై కోర్టు షాకింగ్ కామెంట్స్.. మంత్రిపై తీవ్ర ఆగ్రహం


 


చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కొంగవారిపల్లి ఎస్టీ కాలనీలో వద్ద శుక్రవారం ఉదయం మామిడి తోటలో ఏనుగుల గుంపు తిష్టవేసింది. దాదాపు 30 నుంచి 40 సంఖ్యలో ఏనుగులు రావడంతో స్థానిక రైతులు భయాందోళన చెందారు. చుట్టుపక్కల గ్రామస్తులు ఏనుగుల గుంపుతో ఉలిక్కిపడ్డారు. ఎక్కడ గ్రామాల వైపు దూసుకొస్తాయోననే భయపడ్డారు. స్థానికులు డప్పు చప్పుళ్లు, పటాకులు వంటివి పేల్చి ఏనుగులను తరిమికొట్టే ప్రయత్నం చేశారు. అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి ఏనుగుల గుంపును దారి మళ్లించారు.

Also Read: Singareni: సింగరేణి ఉద్యోగులకు జాక్‌పాట్‌.. ఒక్కొక్కరికి రూ.93,750 దీపావళి బోనస్‌


 


తెలంగాణలో..
తెలంగాణలో కూడా ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. కొమురంభీం జిల్లాలో ఏనుగు కదలికలు కలకలం సృష్టించాయి. మహారాష్ట్ర-తెలంగాణ అటవీ ప్రాంతానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఏనుగు సంచరిస్తున్నట్టు ఇరు రాష్ట్రాల అటవీ అధికారులు తెలిపారు. జిల్లాలోని చింతలమనేపల్లి, బెజ్జురు,పెంచికలపేట అటవీ పరిసర గ్రామాల ప్రజలను అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. పెంచికలపేట మండలంలోని పలు గ్రామాల్లో డప్పు చాటింపు ద్వారా ప్రజలకు జాగ్రత్తలు చెబుతున్నారు. గతేడాది ఏప్రిల్ 3వ తేదీన చింతలమనేపల్లి మండలం బాబాపూర్ గ్రామంలో ఏనుగులు విజృంభించి స్థానిక రైతు అల్లూరి శంకర్‌ను దారుణంగా చంపిన విషయం తెలిసిందే. మరుసటి రోజు ఏప్రిల్ 4న పెంచికలపేట మండలం కొండపల్లి గ్రామానికి చెందిన కారు పోషన్న అనే రైతును కూడా చంపేశాయి. ప్రస్తుతం మళ్లీ ఏనుగులు హల్‌చల్‌ చేయడంతో నాటి విషాద సంఘటనలను స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి