'కరోనా వైరస్'తో ప్రపంచం  అంతా అల్లకల్లోలంగా మారుతోంది. కానీ పాకిస్తాన్ కు చీమకుట్టినట్లు కూడా కనిపించడం లేదు.  ఇప్పుడున్న పరిస్థితుల్లోనూ భారత్ పై నిత్యం యుద్ధ కాంక్షతో  రగిలిపోతున్నట్లుగా కనిపిస్తోంది. భారత సరిహద్దు వెంబడి ఈ సమయంలోనూ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయంటే ఏమనుకోవాలి..?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓ వైపు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. పోలీసులు .. ఎవరినీ ఇళ్ల నుంచి బయటకు  రాకుండా పహారా  కాస్తున్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కునేందుకు 24 గంటలు డ్యూటీ చేస్తున్నారు. ఇలాంటి  సమయంలో ఉగ్రవాదులు అదును చూసి జమ్మూ కాశ్మీర్ సరిహద్దు గుండా భారత్ లోకి చొరబడ్డారు. ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం అందుకున్న జమ్ము కాశ్మీర్ పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కుల్గాం జిల్లా నందిమార్గ్ లో ఈ ఘటన జరిగింది.  భద్రతా  బలగాలు  చుట్టుముట్టగానే ముష్కరులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు కూడా  ధీటుగా జవాబిచ్చారు. కొద్దిసేపటి తర్వాత ఉగ్రవాదుల వైపు  నుంచి కాల్పులు ఆగిపోయాయి. భద్రతా బలగాలు వెళ్లి చూడగా .. ముష్కర  మూకలు అక్కడి నుంచి పారిపోయాయి. ఐతే ఆయుధ సామాగ్రి అక్కడే వదిలి వెళ్లారు. పోలీసులు  వాటిని స్వాధీనం చేసుకున్నారు.  


అందులో PIKA LMG ఆయుధాలతోపాటు IED బాంబులు  కూడా ఉన్నాయి. పారిపోయిన ఉగ్రవాదులనుపట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.  కుక్కలతో గాలింపు  చర్యలు  చేపట్టారు. మరోవైపు జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద సంస్థకు సహకరిస్తున్న వ్యక్తిని ఆర్ఎస్ పురా పోలీసులు అరెస్టు చేశారు. 


అటు నిన్న రాత్రి మరోసారి పాకిస్తాన్.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. మెంధర్, బాలాకోట్ సెక్టార్లలో రాత్రి 10 గంటలకు కాల్పులు ప్రారంభించింది. ఐతే  భారత ఆర్మీ జవాన్లు వారికి ధీటుగా సమాధానమిచ్చారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..