EPF Interest Rate Latest Updates: వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈపీఎఫ్ వడ్డీ రేటు తగ్గుతుందని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాదారులు భావిస్తున్నారు. కానీ కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వశాఖ, ఈపీఎఫ్ఓ ఈ నిర్ణయం తీసుకుంటే కనుక గడిచిన ఆర్థిక సంవత్సరానికి సైతం ఈపీఎఫ్ ఖాతాదారుల తక్కువ వడ్డీని పొందనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల ఈపీఎఫ్ఓ 2019-20 ఏడాదికి సంబంధించి వడ్డీ మొత్తాన్ని విడుదల చేసింది. 8.5 శాతం వడ్డీ నగదు ఈపీఎఫ్ ఖాతాలకు చేరింది. మార్చినెలలో ఈపీఎఫ్ఓ(EPFO Latest News) కీలక వడ్డీ రేట్లలో కోత విధించనున్నారు. అంటే వడ్డీ రేటు తగ్గించాలని నిర్ణయం తీసుకుంటే, ఆ ప్రభావం 2020-21 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంపై సైతం ఉండనుంది.


Also Read: SBI Personal Loan: ఒక్క ఎస్ఎంఎస్ లేదా Missed Call ద్వారా ఎస్‌బీఐ పర్సనల్ లోన్ పొందవచ్చు


సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(Central Board of Trustees) మార్చి 4న సమావేశం కానున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికిగానూ ఈపీఎఫ్(PF Balance) ఖాతాదారులకు ఎంత వడ్డీ అందించాలన్న అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ వడ్డీ రేటు మరోసారి చర్చనీయాంశమైంది. అయితే గత కొన్నేళ్లుగా ఈపీఎఫ్ వడ్డీ రేట్లపై కోత విధిస్తూనే ఉన్నారు.


Also Read: iPhone 13: యాపిల్ తీసుకొస్తున్న ఐఫోన్ 13 గురించి 10 ఆసక్తికర విషయాలు


2014-15, 2015-16 సమయంలో ఈపీఎఫ్ నగదు నిల్వలపై వడ్డీ రేట్లు -  8.75శాతం


2016 ఏడాదికి ఈపీఎఫ్ నగదు నిల్వలపై వడ్డీ రేట్లు -  8.80శాతం


2017 ఏడాదికి ఈపీఎఫ్ నగదు నిల్వలపై వడ్డీ రేట్లు -  8.65శాతం


2018 ఏడాదికి ఈపీఎఫ్ నగదు నిల్వలపై వడ్డీ రేట్లు -  8.55శాతం


Also Read: EPFO Alert: ఈపీఎఫ్ వడ్డీ రావాలంటే 40 లక్షల మంది ఖాతాదారులు ఇలా చేస్తే సరి


2019 ఏడాదికి ఈపీఎఫ్ నగదు నిల్వలపై వడ్డీ రేట్లు -  8.65శాతం


2020 ఏడాదికి ఈపీఎఫ్ నగదు నిల్వలపై వడ్డీ రేట్లు -  8.5శాతం


ఓవరాల్‌గా గత అయిదారేళ్లలో ఈపీఎఫ్ వడ్డీ రేటు మొత్తంగా 0.25 శాతం తగ్గించారు. ప్రస్తుతం మరింత కోత విధించనున్నట్లు తెలుస్తోంది. త్వరలో స్పష్టమైన ప్రకటన విడుదల కానుంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook