UAN-Aadhar link Deadline: దేశ వ్యాప్తంగా మొత్తం 6 కోట్లకు పైగా ప్రభుత్వం, ప్రైవేట్ ఉద్యోగులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సేవలు పొందుతున్నారు. ఈపీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్‌వో మరో అవకాశం కల్పించింది. యూఏఎన్ నెంబర్‌కు ఆధార్ నెంబర్‌ను అనుసంధానం చేసుకోవడానికి గడువు మరికొంత కాలం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్స్ (Electronic Challan-cum-Returns) దాఖలు చేయడానికి సెప్టెంబర్ 1, 2021 వరకు తుది గడువును పొడిగించింది. ఈ మేరకు ఈపీఎఫ్ ఖాతాదారులు తమ యూఏఎన్ నెంబర్‌కు ఆధార్ నెంబర్ అనుసంధానం చేసుకునే గడువును మరికొంత కాలానికి పొడిగిస్తూ ఈపీఎఫ్‌వో నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్‌వో (EPFO Latest News) సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020లోని సెక్షన్ 142లో కొన్ని మార్పులు చేసింది. ఈసీఆర్ దాఖలు చేసే నియమాలు, విధానంలో సవరణలు చేసింది. 


Also Read: EPFO Alert: ఈపీఎఫ్‌ ఖాతాదారులకు శుభవార్త, జాబ్ కోల్పోయినా COVID-19 అడ్వాన్స్‌ నగదు సాయం


యూఏఎన్ నెంబర్‌కు ఆధార్ అనుసంధానం చేసుకున్న వారికి మాత్రమే ఈసీఆర్ దాఖలు చేసే అవకాశం (EPFO Good News For PF Subscribers) కల్పించింది. యూఏఎన్, ఆధార్ అనుసంధానం చేసుకోని ఈపీఎఫ్ ఖాతాదారులు ప్రత్యేకంగా ఈసీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈపీఎఫ్ ఖాతాకు ఆధార్ అనుసంధానం చేసుకోని వారికి సంస్థలు, కంపెనీలు తమ ఉద్యోగులకు తమ వాటా ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్‌ను నిలిపివేసే అవకాశం ఉందని, ఇదివరకే ఈ మేరకు మార్పులు తీసుకొచ్చినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఈపీఎఫ్ ఖాతాకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలనే వారి కోసం విధానాన్ని ఇక్కడ అందిస్తున్నాం.


Also Read: EPF Interest Money: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త, త్వరలో మీ ఖాతాల్లో వడ్డీ జమ


ఈపీఎఫ్ - ఆధార్ అనుసంధానం చేసుకునే విధానం


1. ఈపీఎఫ్‌వో అధికారిక వెబ్‌సైట్ http://epfindia.gov.in/ సందర్శించండి


2. అందులోని ఆన్‌లైన్ సర్వీస్ విభాగంలోని E-KYC Portal ఆప్షన్ మీద క్లిక్ చేయండి


3. ఆధార్ నెంబర్ ఆ తరువాత మొబైల్ నెంబర్ నమోదు చేయండి. మీకు ఓటీపీ వస్తుంది


4. ఆధార్ నెంబర్ మరోసారి ఎంటర్ చేయాలి. ఆ తరువాత ఓటీపీని వెరిఫై చేసుకోవాలి


5. OTP ఎంటర్ చేసిన తరువాత మీ పీఎఫ్ ఖాతాకు ఆధార్ నెంబర్ అనుసంధానం అవుతుంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook