EPFO: పెన్షనర్లకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(EPFO) గుడ్‌న్యూస్ చెప్పింది. వారి కోసం కొత్త సదుపాయాన్ని అందుబాటులో ఉంచింది. ఫేస్‌ అథెంటికేషన్‌ సిస్టమ్‌ను తీసుకొచ్చింది. ఎక్కడి నుంచైనా డిజిటల్ లైఫ్‌ సర్టిఫికెట్ సమర్పించే అవకాశం కల్పించింది. దీంతో మొత్తం 73 లక్షల మంది పెన్షన్‌దారులకు లబ్ధి చేకూరనుంది. లైఫ్‌ సర్టిఫికెట్ సమర్పించే సమయంలో వయస్సు రిత్యా బయో మెట్రిక్ ఇబ్బందిగా ఉండేది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీటిని పరిగణలోకి తీసుకున్న ఈపీఎఫ్‌వో సరికొత్త సిస్టమ్‌ను అమలులోకి తెచ్చింది. ఫేస్ అథెంటికేషన్‌తో ఇకపై సులువుగా లైఫ్‌ సర్టిఫికెట్‌ పొందవచ్చు. ఈ సదుపాయాన్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ ప్రారంభించారు. ఈకార్యక్రమంలో ఈపీఎఫ్‌వో అత్యున్నత నిర్ణయాక మండలి సెంట్రల్ బోర్డు ఆఫ్‌ ట్రస్టిస్‌తో కలిసి ఆరంభించారు. ఈ విషయాన్ని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. 


ఇటీవల సీబీటీ 231వ సమావేశంలో దీనికి సూత్రప్రాయం అంగీకారం తెలిపారు. విడతల వారిగా ఫేస్‌ అథెంటికేషన్‌ సిస్టమ్‌ అమలు చేస్తామని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటు పెన్షన్ అండ్ ఎంప్లాయి డిపాజిట్ లింక్డ్ ఇన్సురెన్స్ స్కీమ్‌ కాలిక్యులేటర్‌ను సైతం ప్రారంభించారు. దీని ద్వారా పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు పెన్షన్‌, డెత్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రయోజనాలను ఆన్‌లైన్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. 


ఈపీఎఫ్‌వో సెక్యూరిటీస్‌కి రాబోయే మూడేళ్ల పాటు కస్టోడియన్‌గా సిటీ బ్యాంక్‌ ఉండనుంది. ఈమేరకు సీబీటీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో సెక్యూరిటీస్‌కి స్టాండర్డ్ బ్యాంక్ కస్టోడియన్‌గా ఉంది. కొత్త కస్టోడియన్ బాధ్యతలు తీసుకునే వరకు స్టాండర్డ్ ఛార్టరే ఆ ప్లేస్‌లో ఉండనుంది.


Also read:Bhatti Vikramarka: రాజగోపాల్ రెడ్డిని ఒప్పించే ప్లాన్ ఉంది..సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు..!


Also read:DK Aruna: కుటుంబ విభేదాలతోనే షర్మిల పార్టీ పెట్టారు..డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook